అమిత్ షా ర్యాలీలో హింస, రాళ్లదాడి, నిప్పు.. - MicTv.in - Telugu News
mictv telugu

అమిత్ షా ర్యాలీలో హింస, రాళ్లదాడి, నిప్పు..

May 14, 2019

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా  నిర్వహించిన రోడ్‌ షో రచ్చరచ్చయింది. కార్యకర్తలు రాళ్లు, కర్రలతో కొట్టుకున్నారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కోల్‌కతాలో ఆయన రోడ్ షో నిర్వహించారు. అంతవరకు ప్రశాంతంగా ముందుకు సాగుతున్న రోడ్ షోలో ఒక్కసారిగా ఘర్షణ తలెత్తింది. ర్యాలీలో కొంతమంది కార్యకర్తలు ఒకరిపై మరొకరు కర్రలు విసురుకున్నారు. మరికొంతమంది రాళ్లతో రెచ్చిపోయారు.

అంతటితో ఆగకుండా కొందరు అమిత్‌ షా వాహనంపైకి కర్రలు విసరారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు మరింత రెచ్చిపోయి రోడ్డుపై ఉన్న వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగక తప్పలేదు. పోలీసులు లాఠీఛార్జీ చేసి ఆందోళనకారులను చెదరగొట్టి అదుపులోకి తీసుకున్నారు.