సిరీస్ కోల్పోయిన భారత్.. - MicTv.in - Telugu News
mictv telugu

సిరీస్ కోల్పోయిన భారత్..

March 13, 2019

కీలకమైన చివరి వన్డేలో భారత్ చతికిల బడింది. ఆసిస్ రెచిపోయి ప్రతీకారం తీర్చుకుంది.  కోహ్లీ సేనపై 2-3 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. బ్యాట్స్‌మెన్లు నిస్సహాయంగా మారిపోవడంతో ఆఖరి వన్డేలో ఆసిస్ గెలుపు సలువైపోయింది.

Australia beat India by 35 runs to win fifth ODI and series

ఈ రోజు ఢిల్లీలో జరిగిన ఐదో వన్డేలో మొదట బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ఉస్మాన్‌ ఖవాజా(100) సెంచరీతో దడ పుట్టించగా, హ్యాండ్స్‌కోంబ్‌(52)తో స్కోరును పెంచాడు. తర్వాత కూడా ఆసిస్ ప్లేయర్లు చెలరేగారు. కానీ వారికి మనోళ్లు అడ్డకట్ట వేశారు. భువనేశ్వర్‌కు 3, షమీ, జడేజాలకు రెండు వికెట్లు దక్కాయి. 273 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన భారత్ 237 పరుగులకే పరిమితమైంది. రోహిత్‌ శర్మ (56), భువనేశ్వర్‌ కుమార్‌ (46), కేదార్‌ జాదవ్‌ (44) మినహా మరెవ్వరూ పరుగులు చేయలేకపోయారు. 35 పరుగుల తేడాతో సిరీస్ కంగారూలకు వశమైంది.