నకిలీ కరెన్సీని గుర్తించే మొబైల్ టెక్నాలజీ - MicTv.in - Telugu News
mictv telugu

నకిలీ కరెన్సీని గుర్తించే మొబైల్ టెక్నాలజీ

March 10, 2019

నకిలీ కరెన్సీ వలన దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది. ఎన్నో నేరాలు జరగడానికి నకిలీ కరెన్సీ మూలం అవుతుంది. నకిలీ కరెన్సీని అరికట్టడానికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా పూర్తి ఫలితాన్ని ఇవ్వలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో నకిలీ కరెన్సీని గుర్తించేందుకు స్మార్ట్‌ఫోన్‌ అప్లికేషన్‌ను ఆవిష్కరించారు ఐఐటీ-ఖరగ్‌పూర్‌ విద్యార్థులు. ఈ నెల 2-3 తేదీల్లో జరిగిన జాతీయస్థాయి ‘స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌-2019’ తుది పోటీల్లో ఈ ప్రాజెక్టు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

Fake notes detector! This IIT has developed mobile app to identify counterfeit currency - Key details.

ఇమేజ్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీతో స్మార్ట్‌‌ఫోన్‌ ద్వారా నకిలీ భారతీయ కరెన్సీని గుర్తించేలా… ఆరుగురు కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థులు కలిసి దీన్ని అభివృద్ధి చేశారు. దీని ఆవిష్కరణలో టి.వై.ఎస్‌.ఎస్‌.సంతోష్‌, సతీశ్‌కుమార్‌రెడ్డి, విపుల్‌ తోమర్‌, సాయికృష్ణ, తులనీ, డి.వి.సాయిసూర్య పాలుపంచుకున్నారు. ఫోన్‌ ద్వారా కరెన్సీని స్కాన్‌ చేస్తే… అది నకిలీ నోటా, కాదా అన్నది తేలిపోతుందని వారు వివరించారు. మరో ఆరుగురు విద్యార్థుల బృందం చిన్నపాటి సెన్సర్ల ద్వారా ‘న్యూక్లియర్‌ రేడియేషన్‌’ జాడను పసిగట్టే వ్యవస్థను రూపొందించింది. అణుశక్తి సంస్థల్లో లీకేజీలను గుర్తించి హెచ్చరించడానికీ.. రేడియో థెరపీ వంటి క్యాన్సర్‌ చికిత్సల్లో కూడా అప్లికేషన్‌ ఉపకరిస్తుందని భావిస్తున్నారు.