షావోమి ఈ-బైక్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120 కిలోమీటర్లు వెళ్లొచ్చు - MicTv.in - Telugu News
mictv telugu

షావోమి ఈ-బైక్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120 కిలోమీటర్లు వెళ్లొచ్చు

April 25, 2019

చైనాకు చెందిన దిగ్గజ ఎలక్ట్రానిక్స్ కంపెనీ షావోమి తాజాగా సరికొత్త ఎలక్ట్రిక్ బైసైకిల్‌‌ను ఆవిష్కరించింది. హిమో బ్రాండ్ పేరుతో దీనిని ఆవిష్కరించిన దీనికి హిమో టీ1 గా నామకరణం చేసింది. ఇందులో 90ఎంఎం వెడల్పైన టైర్లు, వన్ బటన్ స్టార్ట్, మల్టీ కాంబినేషన్ స్విచ్, డిజిటల్ డిస్‌ప్లే వంటి సౌకర్యాలను సమకూర్చింది. హిమో టీ1 ధర దాదాపు రూ.30,700గా ఉండనుంది. చైనా మార్కెట్‌లో వీటి విక్రయాలు ఈ ఏడాది జూన్ 4 నుంచి ప్రారంభం కానున్నాయి. షాంఘై క్సిమో ఎలక్ట్రిక్ టెక్నాలజీ సంస్థ వీటివి విక్రయించనుంది.

హిమో టీ1లో 14,000 ఎంఏహెచ్, వోల్టేజ్ 48వీ కెపాసిటీ కలిగిన లిథియమ్ అయాన్ బ్యాటరీ ఉంటుంది. 14ఏహెచ్, 28ఏహెచ్ ఎనర్జీ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. 14ఏహెచ్ ఆప్షన్‌తో ఎలక్ట్రిక్ బైసైకిల్ 60 కిలోమీటర్లు వెళ్తుంది. అదే 28 ఏహెచ్ ఆప్షన్‌తో అయితే 120 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. అలాగే కంపెనీ ఇందులో ఫ్రంట్ సస్పెన్షన్ ఫోర్క్, డ్యూయెల్ కోయిలోవర్ రియర్ సస్పెన్షన్, హైడ్రాలిక్ డిస్క్ ఫ్రంట్ బ్రేక్, రియర్ డ్రమ్ బ్రేక్ వంటి ఫీచర్లను కూడా అమర్చింది. ఇకపోతే హిమో టీ1 టాప్ స్పీడ్ ఎంతో తెలియదు. దీని బరువు 53 కేజీలు. రెడ్, గ్రే, వైట్ వేరియంట్స్ లో ఇది అందుబాటులో ఉండనుంది.