హానర్ ఫోన్లపై రూ. 10,000 తగ్గింపు - MicTv.in - Telugu News
mictv telugu

హానర్ ఫోన్లపై రూ. 10,000 తగ్గింపు

May 13, 2019

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ హానర్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు ధరలను ప్రకటించింది. ఏకంగా రూ.10,000 వరకు డిస్కౌంట్ ప్రకటించింది. హానర్ ఫోన్ కొనాలనుకున్నవారికి ఇదే సరైన సమయం. అమెజాన్ ‘హనర్ డేస్ సేల్’ పేరుతో పలు ఫోన్లపై ఈ ఆఫర్లను  అందిస్తోంది. మే 13 నుంచి 17 వరకు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. 


హానర్ 8ఎక్స్ : ఈ ఫోన్ ధర రూ. 12,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇది 4 జీబీ ర్యామ్/64 జీబీ మెమరీ వేరియంట్‌కు వర్తిస్తుంది. ఇక 6 జీబీ ర్యామ్/64 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ.14,999గా ఉంది. అలాగే హానర్ ఫోన్ కొనుగోలుపై హానర్ బ్యాండ్ 4ను డిస్కౌంట్ ధరకు అందిస్తోంది. 

హానర్ ప్లే : ఈ ఫోన్ ధర రూ.13,999. 4 జీబీ ర్యామ్ వేరియంట్‌కు ఇది వర్తిస్తుంది. దీని అసలు ధర రూ.21,999. ఇక 6 జీబీ ర్యామ్ ఫోన్‌ను రూ.15,999కు పొందొచ్చు. ఈ ఫోన్‌లో కిరిన్ 970 ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ ఉంది.


హానర్ 10 లైట్ : రూ 10,999 ప్రారంభ ధరతో లభిస్తుంది ఈ ఫోన్. 3 జీబీ ర్యామ్ వేరియంట్‌కు ఈ ధర వర్తిస్తుంది. 4 జీబీ ర్యామ్ ధర రూ.12,999గా ఉండగా, ఎక్స్‌చేంజ్ ఆఫర్‌పై రూ.1,000 తగ్గించి అందిస్తున్నారు. ఇందులో 24 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 

హానర్ 9ఎన్ : 4 జీబీ ర్యామ్/64 జీబీ మెమరీ వున్న ఈ ఫోన్‌ను రూ.9,999కు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ అసలు ధర రూ.15,999. అలాగే హానర్ వ్యూ 20 ఫోన్‌ ధర రూ.42,999 వుండగా రూ.37,999 పొందొచ్చు.