భారీ స్కోర్ సాధించిన టీం ఇండియా - MicTv.in - Telugu News
mictv telugu

భారీ స్కోర్ సాధించిన టీం ఇండియా

March 10, 2019

ఆస్ట్రేలియాతో మొహాలీ వేదికగా జరుగుతున్న నాలుగో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భ్రాత జట్టుకు ఓపెనర్లు శిఖర్ ధవన్-రోహిత్ శర్మలు అద్భుత శుభారంభాన్ని అందించారు. శిఖర్ ధావన్ 143 పరుగులు చేసి కెరీర్‌లోనే బెస్ట్ స్కోర్ నమోదు చేసాడు. ధావన్ 97 బంతుల్లో 12 ఫోర్లు, సిక్సర్‌తో కెరీర్‌లో 16 సెంచరీ నమోదు చేశాడు. ఈ సిరీస్ ఆరంభం నుంచి వరుసగా విఫలమవుతూ వస్తున్న ఓపెనర్లు రోహిత్-ధవన్‌లు ఈసారి ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా ఆచితూచి ఆడి టీం ఇండియా భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించారు.

India vs Australia Live Cricket Score 4th ODI at Mohali Shankar Leads India s Late Charge.

రోహిత్ శర్మ విషయానికి వస్తే.. అర్థ సెంచరీ వరకు నెమ్మదిగా ఆడిన రోహిత్.. అర్ధ సెంచరీ తర్వాత వేగం పెంచినా కూడా సెంచరీకి ఐదు పరుగుల ముందు అవుటయ్యాడు. 95 పరుగుల వద్ద రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి హ్యాండ్స్‌కోంబ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీనితో ఇండియా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందుంచింది. కోహ్లీ 7, కేఎల్ రాహుల్ 26, రిషబ్ పంత్ 36, జాదవ్ 10 సాధించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో పాట్ కమ్మిన్స్ 5 వికెట్లు, రీచర్డ్సన్ 3 వికెట్లు, జంపా 1 వికెట్ తీశారు.