మొహాలీ వన్డేలో ధావన్ సెంచరీ.. - MicTv.in - Telugu News
mictv telugu

మొహాలీ వన్డేలో ధావన్ సెంచరీ..

March 10, 2019

97 బంతుల్లో 12ఫోర్లు, ఒక్క సిక్స్‌తో సెంచరీ కొట్టాడు ఓపెనర్ శిఖర్ ధావన్. ఉరకలెత్తే ఉత్సాహంతో ఆస్ట్రేలియాతో నాలుగో వన్డేలో టీమిండియా దూకుడుగా ఆడుతోంది. ఈ క్రమంలో మొహాలీ వన్డేలో శిఖర్ ధావన్ సెంచరీ సాధించాడు. వన్డే కెరీర్‌‌లో శిఖర్‌కిది 16వ సెంచరీ.

India vs Australia Shikhar Dhawan hits 16th ODI hundred to roar back to form.

శిఖర్‌తో పాటు రోహిత్ కూడా రాణించాడు. తొలుతనుంచీ ఆటలో మెరుపు బ్యాటింగ్‌ చూపించాడు శిఖర్. ఆసీస్ పేసర్లను ఉరకలెత్తించాడు. 31వ ఓవర్ లో రోహిత్ (95) ఔట్ కావడంతో సెంచరీ మిస్ అయ్యింది. 35 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టానికి 222 రన్స్. శిఖర్ ధావన్(115), రాహుల్ (10) క్రీజులో ఉన్నారు.