ప్రజాసంక్షేమానికే పెద్దపీట.. కేసీఆర్ బడ్జెట్ - MicTv.in - Telugu News
mictv telugu

ప్రజాసంక్షేమానికే పెద్దపీట.. కేసీఆర్ బడ్జెట్

February 22, 2019

ఊహించినట్లుగా తెలంగాణ తాత్కాలిక బడ్జెట్‌లో ప్రజాసంక్షేమానికి పెద్ద పీట వేశారు. వివిధ పథకాలకు భారీగా నిధులు కేటాయించారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం చదివి వినిపించారు. తెలంగాణ ఎన్నో సమస్యలను నెత్తినపెట్టుకుని ఆవిర్భవించిందని, క్రమంగా వాటిని పరిష్కరించుకుంటూ అగ్రగామిగా సాగుతోందని అన్నారు.  2019-20 తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ మొత్త రూ. 1,82,017 కోట్లని ప్రకటించారు. ఎన్నికల సమయంలో  ఇచ్చిన హామీ మేరకు వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, బోదకాలు బాధితులు, నేత, గీత కార్మికులు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఇచ్చే నెలసరి పెన్షన్ మొత్తాన్ని రూ. 1000 నుండి రూ. 2016 కి పెంచుతున్నామని, దివ్యాంగుల పెన్షన్ రూ. 1500 నుండి రూ. 3016కు పెంచి, నిరుద్యోగులకు రూ. 3,016 ఇస్తున్నామన్నారు. వృద్ధాప్య పెన్షన్ కనీస అర్హత వయస్సును 65 సంవత్సరాల నుండి 57 సంవత్సరాలకు తగ్గించామన్నారు.

Kcr telangana budget gives priority  to social welfare schemes

బడ్జెట్ స్వరూపం

రెవెన్యూ వ్యయం రూ. 1,31,629 కోట్లు

మూలధన వ్యయం రూ. 32,815 కోట్లు

రెవెన్యూ మిగులు రూ. 6,564 కోట్లు

ఆర్థిక లోటు రూ. 27,749 కోట్లు ఉంటుందని అంచనా

 

బడ్జెట్ విశేషాలు..

వ్యవసాయ రంగానికి రూ. 20,107 కోట్లు

నీటిపారుదల రంగానికి  రూ. 22,500 కోట్లు

ఆసరా పెన్షన్లకు రూ. 12,067 కోట్లు

బియ్యం సబ్సిడీలకు రూ. 2,744 కోట్లు

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు రూ. 1,450  కోట్లు

నిరుద్యోగ భృతికి రూ. 1,810 కోట్లు

ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధికి 16,581 + 9,827 కోట్లు

మైనారిటీల సంక్షేమానికి రూ. 2,004 కోట్లు

రైతు రుణమాఫీకి రూ. 6,000 కోట్లు

2018 డిసెంబర్ 11 నాటికి ఉన్న రూ. లక్ష వరకు పంట రుణాలు మాఫీ

రైతుబంధుకు రూ. 12,000 కోట్లు

రైతుబంధు పథకానికి ఎకరానికి ఏడాదికి రూ.8 నుంచి రూ.10 వేలు పెంపు

రైతు బీమాకు రూ. 650 కోట్లు

ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ. వెయ్యి కోట్లు

ఈఎన్టీ, దంత పరీక్షల కోసం రూ. 5,536 కోట్లు