ఐపీఎల్‌లో ధోని సరికొత్త రికార్డు - MicTv.in - Telugu News
mictv telugu

ఐపీఎల్‌లో ధోని సరికొత్త రికార్డు

April 12, 2019

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సారధి మహేంద్ర సింగ్ ధోని సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో మొదటిస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన ధోని సేన ఆరు విజయాలతో 12 పాయింట్లు సాధించింది. గురువారం రాజస్థాన్ రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో విజయం సాధించింది. దీంతో ఆ జట్టు కెప్టెన్ ధోనీ ఖాతాలోకి అరుదైన రికార్డు వచ్చి చేరింది.

రాజస్థాన్‌పై విజయం సాధించిన చెన్నై వంద మ్యాచుల్లో విజయం సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది. మొత్తం 166 మ్యాచ్‌లు ఆడిన చెన్నై సరిగ్గా వంద విజయాలు నమోదు చేసింది. అంతేకాదు, ఐపీఎల్‌లో వంద మ్యాచులు గెలిచిన జట్టుకు సారథ్యం వహించిన తొలి కెప్టెన్‌గా ధోనీ పేరు రికార్డుల్లోకి ఎక్కింది.