మెయిన్ రోడ్ల పక్కన నివసిస్తే.. అంగస్తంభన సమస్య - MicTv.in - Telugu News
mictv telugu

మెయిన్ రోడ్ల పక్కన నివసిస్తే.. అంగస్తంభన సమస్య

February 5, 2019

శృంగార సమస్యల పరిష్కారం దిశగా శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు కొత్తకొత్త విషయాలు కనిపెడుతున్నారు. సమస్యలకు కారణాలను ఆరా తీసి, తర్వాత ఔషధాలు రూపొందిస్తున్నారు. మగవారిని వేధించే అంగ స్తంభన సమస్యలను అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలు తాజాగా కాలుష్యంపై దృష్టి సారించారు.Telugu news Men living on main roads risk 'significant' erectile dysfunction revealed in china scientist experiment మెయిన్ రోడ్లపై నివసించే పురుషుల్లో అంగస్తంభన సమస్యలు ఉన్నట్లు తాజాగా గుర్తించారు. శిలాజ ఇంధన కాలుష్యానికి.. పురుషాంగం స్తంభించడానికి మధ్య సంబంధంపై వారు అధ్యయనం చేశారు.  ప్రయోగంలో భాగంగా ఎలుకలపై ఐదునెలలపాటు కాలుష్యవాయువులు పంపారు. తర్వాత వాటి సెక్స్ సామర్థ్యాన్ని పరీక్షించగా అంగం తగినంతగా గట్టిపడకపోవడాన్ని గుర్తించారు. వాయు, ఇతర కాలుష్యాల ప్రభావం వల్ల అంగంలోకి రక్తప్రసరణ సరిగ్గా జరక్కపోవడం వల్ల స్తంభన సమస్య తలెత్తినట్లు తేలింది. ప్రధాన రహదారుల్లో వాహనాలు వెదజల్లే కర్బన ఉద్గారాలు, ఇతర కాలుష్య కారకాల వల్ల ఈ సమస్య అక్కడున్న మగవారిలోనూ ప్రభావం చూపుతుండొచ్చని, అయితే దీనిపై మరిన్ని ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఉందని పరిశోధకులు పేర్కొన్నారు.కాలుష్యం వల్ల మగవారు సెక్స్‌లో త్వరగా అలసిపోతారని, ఊపరితిత్తులకు తగినంత గాలి అందకపోవడం దీనికి కారణమన్ని పేర్కొన్నారు.   చైనాలో గాంగ్‌జౌ వర్సిటీ శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాలు నిర్వహించారు. ఫలితాలను సెక్సువల్ మెడిసిన్ పత్రికలో ప్రచురించారు.