జూ.ఎన్టీఆర్ తక్కువోడేమీ కాదు, నా ఫొటోను.. లక్ష్మీపార్వతి - MicTv.in - Telugu News
mictv telugu

జూ.ఎన్టీఆర్ తక్కువోడేమీ కాదు, నా ఫొటోను.. లక్ష్మీపార్వతి

February 16, 2019

దివంగత మాజీ ముఖ్యమంత్రి, నటుడు ఎన్టీఆర్ జీవిత చరమాంకం ఆధారంగా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తీస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల కాకముందే కాక రేపుతోంది. ఎన్టీఆర్ పిల్లలకు, ఆయన రెండో భార్య లక్ష్మీపార్వతికి మధ్య జరిగిన గొడవలను, వారు ఆమెను హింసించడాన్ని ఈ మూవీ ట్రైలర్‌లో చూపడంతో మరింత ఆసక్తి రేగింది. సినిమా మొత్తం.. లక్ష్మీపార్వతికి సానుకూలంగా ఉంటుందని వర్మ చెప్పకనే చెప్పాడు.

ntr’s second wife lakshmiparvathi on lakshmisntr biopic trailer by rgv ramgopal varma accused junior ntr tears her photo with husband

ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్‌పై లక్ష్మీపార్వతి.. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు తనను మానసికంగా, శారీరకంగా హింసించిన వైనాన్ని మరోసారి గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్ ప్రతిరూపంగా భావించే జూనియర్ ఎన్టీఆర్‌పై కూడా ఆమె విమర్శలు చేశారు. అతడు తక్కువోడేమీ కాదని అన్నారు. రామారావుతో పెళ్లయిన తర్వాత తానే జూనియర్ ఎన్టీఆర్‌నే మనవడు కదా అని ఇంటికి పిలిపించుకున్నానని, కానీ అతడు తర్వాత దురుసుగా ప్రవర్తించాడని తెలిపారు.

‘అతడు ఎంతైనా మన మనవడే కదా పిలిపించాను. వాళ్ల తాతగారు, నేను, జూనియర్ ఎన్టీఆర్ ముగ్గురం కలిసి ఫొటో కూడా దిగాం. ఎన్టీఆర్ మా ఇధ్దరి మధ్యలో నిలబడిమా భుజాలపై చేతులు వేసి మరీ ఫొటో దిగాడు. కానీ రామారావుగారి ప్రభుత్వం పడిపోయాక జూ.ఎన్టీఆర్ నా ఫొటో చింపి అవతల పడేశాడు. వాడు ఎప్పుడూ తాతగారితో ఉన్న ఫొటోనే చూపుతాడు. వాడు కూడా మిగతావారికేమీ తక్కువ కాదు. ఆ రోజుల్లో జూ. ఎన్టీఆర్‌ను చాలా బాగా చూసుకున్నాను. అతనికి ఎదుగుదలకు తోడ్పడ్డాను. అతనితో త్యాగరాజగానసభలో అరంగేట్రం చేయించాను. గడిచిపోయిన గతం కదా.. అందుకే జూ. ఎన్టీఆర్‌ అవన్నీ మరిచిపోయాడు ఇప్పుడు.. ’ అని లక్ష్మీపార్వతి చెప్పారు.