Cinema Politics

టీడీపీ అనితకు వర్మ ఘాటు జవాబులు

రాంగోపాల్ వర్మ తీయబోతున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ షూటింగ్ సెట్లపైకి వెళ్లకముందే వివాదాలు సృష్టిస్తోంది. ఈ సినిమాపై చర్చలకు తన పాలేరు కూడా రాడన్న ఏపీ మంత్రి సోమిరెడ్డికి దిమ్మతిరిగే సమాధానమిచ్చిన వర్మ తాజాగా టీడీపీ ఎమ్మెల్యే అనితపైనా ఫైర్ అయ్యారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ జీవితాన్ని వక్రీకరించొద్దన్న అనితకు అతడు ఫేస్ బుక్‌లో ఇచ్చిన సటైరిక్ సంభాషణ ఇదే..

టీడీపీ ఎమ్మెల్యే అనిత గారికి నా సమాధానాలు:

టీడీపీ ఎమ్మెల్యే అనిత:

ఎన్టీఆర్‌పైన వర్మ తీస్తున్న సినిమాలో చరిత్రను వక్రీకరించవద్దు

అనిత గారు బయట తెలిసిన చరిత్ర వెనుక లోపలి అసలు చరిత్ర చూపించడమే నా అసలు సిసలు ఉద్దేశం

టీడీపీ ఎమ్మెల్యే అనిత: 

ఎన్టీఆర్ మహానుభావుడు…ఆయన పేదలకు ,ప్రజలకు చేసిన మంచిని వర్మ తన సినిమాలో చూపించాలి.

అనితగారు ఈ సినిమా బయోపిక్ కాదు..కేవలం లక్ష్మి పార్వతి గారు ఆయన జీవితం లో ప్రవేశించినప్పటినుంచీ తుది వరకూ

టీడీపీ ఎమ్మెల్యే అనిత: 

ఎన్టీఆర్ కీర్తికి భంగం కలిగేలా ఎవరు సినిమా తీసిన టీడీపీ కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు చూస్తూ ఊరుకోరు.

అనితగారు ఇలాంటి వార్నింగ్ లు టీడీపీ పుట్టకముందునుంచి విని విని విసుగెత్తిపోయాను

టీడీపీ ఎమ్మెల్యే అనిత: 

రాజకీయంగా చంద్రబాబును ఎదుర్కోలేకే..వైసీపీ నేతలు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీస్తున్నట్లు ఉంది..

లోగుట్టు పెరుమాళ్ళకెరుక

టీడీపీ ఎమ్మెల్యే అనిత: 

చనిపోయిన ఎన్టీఆర్‌పైన సినిమా తీసి టీడీపీని ఇబ్బంది పెట్టాలని వైసీపీ నేతలు అనుకుంటే…బ్రతికి ఉన్న జగన్‌పైన కూడా సినిమా తీసే వాళ్ళు

ఉన్నారు.. జగన్ జీవిత చరిత్ర ప్రజలకు సినిమా రూపంలో చూపిస్తే..ఆయన పాదయాత్ర కూడా చెయ్యలేరు..

అనితగారు మీరు సూపరు ..నాకు తెలిసి ఇలాంటి స్క్రిప్ట్ ఐడియా షోలే రైటర్ సలీమ్ జావేద్ కి కాని బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారికి కూడా వచ్చిఉండదు 🙏🙏

టీడీపీ ఎమ్మెల్యే అనిత: 

మహానుభావుల్లో ఉన్న మంచినే తీసుకోవాలి… అదే సమజాహితo

ఆహా క్లాప్సు విజిల్స్ !!!

 

Leave a Reply