mictv telugu

నిరుద్యోగులకు శుభవార్త.. రైల్వేలో ఉద్యోగాల భర్తీ

January 15, 2019

నిరుద్యోగులకు శుభవార్త. భారతీయ రైల్వేలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 81 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు 1 ఫిబ్రవరి 2019 లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Telugu News Indian western railways seeking applications for technical posts .

రైల్వే జోన్: సౌత్ వెస్ట్రన్ రైల్వే

మొత్తం ఉద్యోగాల సంఖ్య : 81

ఉద్యోగం పేరు: సీనియర్ టెక్నికల్ అసోసియేట్, జూనియర్ టెక్నికల్ అసోసియేట్

ఉద్యోగ స్థలం : కర్నాటక, ఆంధ్రప్రదేశ్, గోవా, తమిళనాడు

దరఖాస్తులకు చివరి తేదీ : 1 ఫిబ్రవరి 2019

విద్యార్హతలు:

– సీనియర్ టెక్నికల్ అసోసియేట్: ఇంజనీరింగ్ డిగ్రీ

– జూనియర్ టెక్నికల్ అసోసియేట్: మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా

వయోపరిమితి:

సీనియర్ టెక్నికల్ అసోసియేట్: 20 నుంచి 33 ఏళ్లు

జూనియర్ టెక్నికల్ అసోసియేట్: 18 నుంచి 33 ఏళ్లు

వేతనం :

సీనియర్ టెక్నికల్ అసోసియేట్: నెలకు రూ. 32000/-

జూనియర్ టెక్నికల్ అసోసియేట్: నెలకు రూ. 25000/-

అప్లికేషన్ రుసుము :

ఎస్సీ/ఎస్టీ/మహిళలు/దివ్యాంగులు: ఫీజు నుంచి మినహాయింపు

ఇతరులు: రూ. 100/-

ఎంపిక విధానం : మెరిట్ ఆధారంగా

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 10 జనవరి 2019

దరఖాస్తులకు చివరి తేదీ : 1 ఫిబ్రవరి 2019

Telugu News Indian western railways seeking applications for technical posts