చలితో గుండెపోటు.. ఈ జాగ్రత్తలు తీసుకోండి.. - MicTv.in - Telugu News
mictv telugu

చలితో గుండెపోటు.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..

January 31, 2019

చలి పులి పంజా విసురుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. దీనితో జనం అవస్థలు పడుతున్నారు. ఆరోగ్యంగా ఉన్న సాధారణ ప్రజలే చలికి వణికి పోతుంటే… వివిధ రోగాలతో బాధపడుతున్న వారి పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. చలికాలంలో వివిధ శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చలి కాలంలో గుండెజబ్బు రోగులు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.Telugu News precautions to take in winter* చలి వల్ల వాతావరణం తేమగా వుండడం వల్ల గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులపై ఒత్తిడి అధికంగా ఉంటుంది. దీంతో గుండెపోటు రావడానికి ఆస్కారముంటుంది.

* ప్రతిరోజూ వాకింగ్‌కు వెళ్ళేవారు సూర్యుడు ఉదయించిన తర్వాత వెళ్ళడం మంచిది.

* ఎక్కువ సమయం ఇంట్లో ఉండడానికి ప్రయత్నించాలి.

* ఐదేళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి.

* అవయవ మార్పిడి శస్త్రచికిత్స పొందినవారు మధుమేహులు, క్యాన్సర్‌, ఆస్త్మా  సీఓపీడీ వంటి సమస్యలతో బాధపడుతున్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

* చలి తీవ్రంగా ఉన్న సమయంలో నడక మంచిది కాదు. చలి తగ్గాక వ్యాయామం చేస్తేనే మంచిది.

* చలి సమయంలో బయటకు వెళ్తే.. శరీరమంతటినీ కప్పి ఉంచేలా దళసరి వస్త్రాలు ధరించాలి.

* చర్మం పొడిబారకుండా తేమను పెంచే లేపనాలు, కొబ్బరినూనె, ఆలీవ్‌ నూనె వంటి వాటిని చర్మానికి పట్టించాలి.

* చలి తీవ్రంగా ఉన్నప్పుడు చేతులు పట్టుతప్పుతాయి. అందువల్ల రాత్రిళ్లు వాహనాలు నడపకపోవడమే మంచిది.

* చలిగా ఉందనే కారణంతో తాగునీటిని తగ్గిస్తుంటారు. ఇది సరికాదు. నీటిని తగు మోతాదులో తీసుకోవాల్సిందే.