సైనిక వీరులకు నావంతుగా.. విజయ్ దేవరకొండ - MicTv.in - Telugu News
mictv telugu

సైనిక వీరులకు నావంతుగా.. విజయ్ దేవరకొండ

February 16, 2019

వర్షాలు, వరదలు, కష్టాలు, కన్నీళ్లు వచ్చినా వారికి నేనున్నాను.. అంటూ సాయం చేయడంలో ముందుండే హీరో విజయ్ దేవరకొండ. కేరళలో భారీ వర్షాలు, శ్రీకాకుళంలో తిత్లీ తుపాన్ వచ్చినప్పుడు విజయ్ మొదట స్పందించి తన వంతు సహాయం చేశాడు. తాజాగా జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మందికి పైగా జవానులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. వీరమరణం పొందిన జవాన్ల గురించి అందరిలా మొదట విజయ్ ట్వీట్లు చేయకుండా..  వారికి ఆర్థిక సాయం అందించి, ఆ సర్టిఫికెట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, నెటిజన్ల మనన్నలు అందుకుంటున్నాడు.

Telugu News Tollywood Hero Vijay Devarakonda Help To Soldiers Families.

ఈ సందర్భంగా విజయ్ ‘వారు మన కుటుంబాల్ని రక్షిస్తున్నారు. మనం ఆ సైనికుల కుటుంబాలకు అండగా నిలవాలి. సైనికుల జీవితాలను సాయంతో వెలకట్టలేము. కానీ మనం మనవంతు సహకారం అందించాలి. నావంతు సహకారం నేను అందించాను.

మనందరం కలిసి సాయం చేద్దాం. మనమంతా కలిసి వారికో పెద్ద సపోర్ట్‌ని క్రియేట్ చేద్దాం’ అని ట్వీట్ చేసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. దీనికి నెటిజన్లు ‘సైనికులకు ఎలా సాయం చేయాలో చెప్పినందుకు చాలా థ్యాంక్స్ విజయ్. మేము కూడా మా వంతు సహకారం అందజేస్తాం’ అని పోస్టులు చేస్తున్నారు.

Telugu News Tollywood Hero Vijay Devarakonda Help To Soldiers Families