Health Social

ఎయిడ్స్..  తెలుగు రాష్ట్రాల్లనే ఎక్కువ

మన దేశం రికార్డుల మీద రికార్డులు కొడుతోంది. మొన్నటి వరకు తాగుబోతులు ఎక్కువగా వున్న దేశం మనదే అని మత్తుగా మెరిసింది. ఇప్పుడు మన దేశంలో ఎయిడ్స్ బాధితులు ఎక్కువ‌గా వున్నారని,  అది కూడా ఎక్కువ మంది ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే ఉన్నార‌ని ఎయిడ్స్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ ఈశ్వ‌ర్ గిలాడ తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల త‌ర్వాతి స్థానాల్లో క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడు రాష్ట్రాలు ఉన్నాయి. పైన తెలిపిన రాష్ట్రాల్లో ఎయిడ్స్ తీవ్ర‌త అధికంగా ఉంద‌ని తెలిపారు. అలాగే ఎయిడ్స్ ప‌రిష్కారంలోనూ తెలుగు రాష్ట్రాలే ముందంజ‌లో ఉన్నాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

ఎయిడ్స్ నియంత్ర‌ణ సంస్థ నిర్వ‌హిస్తున్న ‘ ఆసికాన్ -2017 ’ సదస్సు ఈ రోజు ప్రారంభం అవుతోంది. మూడు రోజుల పాటు హైద్రాబాద్‌లో ఈ స‌ద‌స్సు జరుగుతుంది. ఎయిడ్స్ నియంత్ర‌ణ‌కు, నిర్మూల‌నకు చేప‌ట్టాల్సిన కార్య‌క్ర‌మాల‌ను, చ‌ర్య‌ల‌ను ఈ స‌ద‌స్సులో చ‌ర్చించ‌నున్నారు. ఐక్య‌రాజ్య‌స‌మితి సుస్థిరాభివృద్ధి ల‌క్ష్యాల మేర‌కు 2030లోగా ప్ర‌పంచం నుంచి ఎయిడ్స్‌ను పార‌ద్రోలేందుకు కృషిచేయాల‌ని ఈశ్వ‌ర్ తెలియ‌జేశారు. ఎయిడ్స్ చికిత్స‌కు అవ‌స‌ర‌మైన మందుల్లో 92 శాతం భార‌త‌దేశ‌మే స‌ర‌ఫ‌రా చేస్తోంద‌ని, మందులు స‌ర‌ఫ‌రా చేసే ఆరు ముఖ్య‌ సంస్థ‌ల్లో మూడు హైద్రాబాద్‌లోనే ఉన్నాయ‌ని తెలిపారు.

Leave a Reply