వాట్సాప్ కొత్త ఫీచర్.. అనుమతి లేకుండా గుంపులో కలిపేయలేరు - MicTv.in - Telugu News
mictv telugu

వాట్సాప్ కొత్త ఫీచర్.. అనుమతి లేకుండా గుంపులో కలిపేయలేరు

March 12, 2019

వాట్సాప్, ఫేస్‌బుక్ గ్రూపుల్లో అడ్మిన్లు మన అనుమతి లేకుండానే మనల్ని కలిపేస్తుంటారు. పనికిమాలిన చెత్తంతా భరించాల్సి వస్తుంది. మొహమాటం వల్ల చాలామంది ఈ నరకాన్ని భరిస్తుంటారు. అక్కడ పేరుకుపోయే మెసేజీలతో మెమరీ తగ్గిపోతుంది కూడా ఈ ఇబ్బందులకు వాట్సాప్ చెక్ పెట్టనుంది.

WhatsApp Group invitation feature comes to beta stable build expected soon.

 

దీని కోసం గ్రూప్ ఇన్విటేషన్ ఆప్షన్ తీసుకొచ్చింది. సెట్టింగ్స్‌లోకి వెళ్లి దీన్ని యాక్టివిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అకౌంట్ లోకి వెళ్లి, ప్రైవసీని క్లిక్ చేసి, గ్రూప్సును  ఎంచుకోవాలి. Who Can ADD me to Groups ఆప్షన్ నొక్కి సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ప్రస్తుతం బీటా వర్షన్ వాట్సాప్ వాడుతున్న ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులకు మాత్రమే ఇది అందుబాటులో ఉంది. తర్వలోనే పూర్తి అప్‌డేట్‌ను అందరికీ అందుబాటులోకి రానుంది.