Home > Featured > అంతరిక్షం నుంచి బ్యాంక్ అకౌంట్ హ్యాక్

అంతరిక్షం నుంచి బ్యాంక్ అకౌంట్ హ్యాక్

NASA astronaut is accused of hacking

ప్రపంచ చరిత్రలో మొదటిసారి అంతరిక్షంలోని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి ఓ వ్యోమగామి మరో వ్యోమగామి బ్యాంక్ అకౌంట్‌ను హ్యాక్ చేసిన సంఘటన సంచలనం రేకిస్తోంది. సుమ్మర్ వార్డెన్ అనే వ్యోమగామి తన మాజీ సహచరురాలు అన్నే మెక్ క్లెయిన్ బ్యాంకు ఖాతాను హ్యాక్ చేశాడు. దీంతో ఆమె ఫెడరల్ ట్రేడ్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో మెక్ క్లయిన్‌పై బ్యాంకు అకౌంట్ హ్యాక్ చేసిన అభియోగాలపై కేసు నమోదైంది.

నాసా సంస్థలోని కంప్యూటర్ల నుంచి తన ఖాతాను హ్యాక్ చేశారని మెక్ ఫిర్యాదు చేశారు. తాను ఐఎస్ఎస్‌లో పని చేస్తున్న వేళ, కొన్నిసార్లు ఖాతాను తెరచానని, ఆ వివరాలను తెలుసుకున్న వార్డెన్, తన ఖాతాను హ్యాక్ చేశాడన్న ఆమె ఆరోపిస్తోంది. తాను, సుమ్మర్ వార్డెన్‌తో కలిసి ఆరు నెలల పాటు స్పేస్ స్టేషన్‌లో పని చేశానని ఆమె తెలిపింది. కాగా, ఆమె చేసిన ఆరోపణలను స్పేస్ స్టేషన్ అధికారులు తిరస్కరించడం గమనార్హం.

Updated : 25 Aug 2019 12:01 AM GMT
Tags:    
Next Story
Share it
Top