మారుతీ సుజుకీ ఇండియా హ్యాచ్ బ్యాక్ కార్ల శ్రేణిలోని ఆల్టోకు మంచి రెస్సాన్స్ ఉంది. కానీ ఈ ఏడాది ఏప్రిల్ అమ్మకాల్లో మాత్రం ఆల్టోను తోసిరాజని స్విఫ్ట్ ముందు వరుసలో నిలిచింది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యాన్ఫ్యాక్సర్స్ రిలీజ్ చేసిన లెక్కల ప్రకారం 51.98శాతం వృద్ధితో ఈ ఏడాది ఏప్రిల్‌లో 23,802 స్విఫ్ట్ వాహనాలు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే నెలలో కేవలం 15,661 వాహనాలు మాత్రమే అమ్మారు.
ఇక ఎప్పటినుంచో బెస్ట్ సెల్లర్‌గా పేరుగడించిన ఆల్టో గతేడాది 16,583 వాహనాలను విక్రయించగా ఈసారి 22,549 వాహనాలను అమ్మడం ద్వారా 35.97శాతం వృద్ధిని నమోదు చేసింది. మారుతీ సుజుకీకే చెందిన మరో వాహనం బాలినో 17,530 యూనిట్ల విక్రయంతో మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వేగన్ ఆర్(16,348), హ్యుందాయ్ ఐ20(12,668) వాహనాలు ఉన్నాయి.