గోవులకు ఆధార్ కష్టాలు వచ్చేశాయి. మనుషల్లాగే వాటికి ఆధార్ మస్ట్ కావడంతో టెక్నిషీయన్ల బృందాలు పల్లెబాట పట్టాయి. ఆవుల చెవుల్లో చిప్ వేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఇదంతా మనదగ్గర కాదులే..గుజరాత్ లో…
గోవధపై గత నెల్లో గుజరాత్ ప్రభుత్వం సంచలన చట్టం తీసుకొచ్చింది. గోవధకు పాల్పడిన వారికి యావజ్జీవ కారాగార శిక్ష విధించే చట్టాన్ని ఆమోదించింది..
గోవుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ‘ఆధార్’ పద్ధతికి శ్రీకారం చుట్టిన గుజరాత్ సర్కార్… అందుకు కార్యాచరణ మొదలుపెట్టింది. ఆవుల చెవుల్లో ఐడీ నంబర్‌తో ఉండే డిజిటల్ చిప్‌లను ఏర్పాటుచేస్తోంది. ఇందుకోసం రాష్ట్రమంతా టెక్నిషీయన్ల బృందాలను పంపించింది. తొలిదశలో భాగంగా.. 37వేల ఆవులకు యునిక్ ఐడెంటినీ నంబర్లను ఇవ్వనుంది.
ఆవుల ఆక్రమ రవాణాను అరికట్టేందుకు ఈ డిజిటల్ చిప్‌లు ఉపయోగపడుతాయని రాష్ట్రప్రభుత్వం చెబుతోంది. చిప్ ఆధారంగా ఆవులు ఎక్కడికి వెళ్లాయని సులువుగా తెలుసుకోవచ్చు అంటోంది. అంతేగాక, గోవుల ఆర్యోగం గురించిన వివరాలు కూడా చిప్‌లు అందిస్తాయని పేర్కొంది. ఈ చిప్‌ల్లో ఆవులకు కేటాయించిన నంబర్, వాటి అడ్రసు, రంగు, ఆరోగ్య పరిస్థితులు తదితర వివరాలను డిజిటల్‌గా నమోదు చేస్తారు. తొలి దశ కింద రూ. 2.8కోట్లు ఖర్చుచేసి 37వేల ఆవులకు ‘ఆధార్’ నంబర్ ఇస్తారు.