ఆ చెప్పులేసుకుంటే రేపిస్టులకు షాకే..!
రోడ్ పై వెళ్తుంటే నిత్యం వేధింపులు తప్పడం లేదా..ఆకతాయిల చేష్టలతో విసిగిపోయారా…మృగాళ్ల ముప్పు పొంచి ఉందా…అమ్మాయిలూ డోంట్ వర్రీ. ఇక ఆ భయం అక్కర్లేదు..ఈ చెప్పులేసుకుంటే చాలు… రేపిస్టుల పని మటాషే…
ఆడోళ్ల కోసం వినూత్నమైన చెప్పులను తయారు చేశాడు సిదార్థ్ అనే 17 ఏళ్ల కుర్రాడు. వాటిని మహిళలు వేసుకుంటే రేపిస్టులకు ఇక ఎలక్ట్రిక్ షాక్ తగులుతుంది. స్కూల్, కాలేజీల్లో నేర్చుకున్న భౌతిక శాస్త్ర సూత్రాలను అనుసరించి ఎలక్ట్రోషూ తయారు చేశాడు. వీటిలో రీచార్జబుల్ బ్యాటరీ, చిన్నపాటి సర్క్యూట్ బోర్డు ఉంటాయి. ఈ చెప్పులను వేసుకున్న మహిళలు ఎంత దూరం నడిస్తే అంత సేపు వాటిలో ఉండే బ్యాటరీ చార్జింగ్ అవుతుంది. అలా అవి ఫుల్ చార్జి అయితే వాటి ద్వారా 0.1 యాంపియర్స్ వరకు విద్యుత్ నిల్వ ఉంటుంది. ఈ క్రమంలో ఎవరైనా అటాక్ చేస్తే ఈ చెప్పులను వేసుకున్న మహిళ వాటితో సదరు వ్యక్తికి ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వవచ్చు. అదే టైమ్ లో పోలీసులు, కుటుంబ సభ్యులకు కూడా సమాచారం చేరుతుంది. ముందే సెట్ చేసి పెట్టడంతో ఇది సాధ్యమవుతుంది. ప్రస్తుతం ఈ ఎలక్ట్రోషూ ప్రొటోటైప్ దశలోనే ఉంది. దీనిపై పేటెంట్ కోసం దరఖాస్తు చేశానని, అది వస్తే స్టార్టప్ ఇంకుబేటర్‌లను సంప్రదించి తన ప్రొడక్ట్‌ను వారికి వివరించి మార్కెట్‌లోకి తెస్తానని సిదార్థ్ చెబుతున్నాడు.