ఇక ఇక్కడ ఆ కార్లు అమ్మరు.. - MicTv.in - Telugu News
mictv telugu

ఇక ఇక్కడ ఆ కార్లు అమ్మరు..

May 18, 2017

భారత్ నుంచి అమెరికా కార్ల సంస్థ జ‌న‌ర‌ల్ మోటార్స్ నిష్ర్కమించబోతోంది. ఈ ఏడాది చివ‌రి నుంచి ఇండియాలో కార్లు అమ్మ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించింది. మ‌న దేశంలో ఆ సంస్థ కేవ‌లం చెవ‌ర్లెట్ కార్ల‌ను మాత్ర‌మే అమ్ముతుంది. ఎంత‌గా ప్ర‌య‌త్నించినా ఇండియాలో మార్కెట్ షేర్‌ను మాత్రం ఆ సంస్థ పెంచుకోలేక‌పోతుంది. పాసెంజ‌ర్ కార్ల అమ్మ‌కాల్లో ఆ సంస్థ వాటా ఒక శాతం క‌న్నా త‌క్కువే. సంస్థ పున‌ర్నిర్మాణంలో భాగంగా ఇండియాలో అమ్మ‌కూడ‌ద‌న్న నిర్ణ‌యాన్ని జ‌న‌ర‌ల్ మోటార్స్ తీసుకుంది. అయితే ఆ సంస్థ ఇప్ప‌టికిప్పుడు ఇండియాను మాత్రం పూర్తిగా వీడ‌టం లేదు. బెంగ‌ళూరులోని టెక్ సెంట‌ర్‌ను కొనసాగించాల‌ని నిర్ణ‌యించింది. అలాగే మ‌హారాష్ట్ర‌లోని తాలెగావ్‌లో ఉన్న ప్లాంట్‌ను కేవ‌లం ఎగుమ‌తుల‌కు మాత్రమే ప‌రిమితం చేయాల‌ని యోచనలో జనరల్ మోటర్స్ ఉంది.