ఇదేం పిచ్చి.. ఫ్యాన్సీ నంబర్ కోసం రూ. 15 లక్షలా.. - MicTv.in - Telugu News
mictv telugu

ఇదేం పిచ్చి.. ఫ్యాన్సీ నంబర్ కోసం రూ. 15 లక్షలా..

April 20, 2022

bbbb

ఫ్యాన్సీ నెంబర్ కోసం ఓ వ్యక్తి ఐదు కాదు. పది కాదు. ఏకంగా 15 లక్షల రూపాయలు చెల్లించిన సంఘటన హరియాణా రాష్ట్రం చండీగఢ్‌లో చోటుచేసుకుంది. ఈ సంఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇందులో ఆశ్చర్యం ఏముంది అని అనుకుంటున్నారా, అవునండీ ఆశ్చర్యమే ఉంది. బ్రిజ్ మోహన్ అనే వ్యాపారి తనకు నచ్చిన వీఐపీ నంబరు కోసం ఏకంగా రూ. 15 లక్షలు చెల్లించాడు. అతను ఖరీదు చేసింది ఏ బెంజ్ కారు కోసమో, ల్యాండ్ రోవర్ రేంజ్ కారు కోసమో కాదు. తన హోండా యాక్టివా స్కూటర్ కోసం. దాని ధర రూ. 11 వేలు మాత్రమే. కేవలం రూ. 11 వేల స్కూటర్ ఫ్యాన్సీ నెంబర్ కోసం రూ. 15 లక్షల రూపాయలు చెల్లించడం సంచలనంగా మారింది. ఇదెక్కడి పిచ్చిరా నాయనా అని కొందరు నెటిజన్లు కామెంట్స్ మీద కామెంట్స్ చేస్తున్నారు.

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాన్సీ నంబర్లను అమ్మకానికి ఉంచడం ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల అక్కడి రవాణా అధికారులు 0001 అనే సంఖ్యతో పూర్తయ్యే నంబరును రూ. 5 లక్షలకు వేలానికి ఉంచారు. దానికోసం ఎంతో మంది పోటీ పడగా, బ్రిజ్ మోహన్ అనే వ్యాపారి రూ. 15.44 లక్షలకు దక్కించుకున్నాడు. ఈ వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 5 కోట్ల అదనపు ఆదాయం సమకూరిందని అక్కడి అధికారులు తెలిపారు. ఏది ఏమైనప్పటికి ఆ వ్యాపారి తన స్కూటర్ కోసం అంత ఖర్చు పెట్టడం సోషల్ మీడియాలో దుమారం రేపుతుంది.