ఈచెట్టు బెరడును పాలలో మరగించి తాగితే, కొలెస్ట్రాల్ ఐస్‎లా కరిగిపోతుంది. - Telugu News - Mic tv
mictv telugu

ఈచెట్టు బెరడును పాలలో మరగించి తాగితే, కొలెస్ట్రాల్ ఐస్‎లా కరిగిపోతుంది.

March 12, 2023

ఈమధ్యకాలంలో చాలామంది అధికబరువుతో బాధపడుతున్నారు. కారణం జీవనశైలి, చెడు ఆహార పదార్ధాల అలవాట్లు. దీంతో చిన్నాపెద్దా తేడా లేకుండా ఊభకాయం బారిన పడుతున్నారు. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కరిగించేందుకు నానా తిప్పలు పడుతున్నారు. అయితే చెడు కొలెస్ట్రాల్ సమస్య నుంచి బయటపడేందుకు అర్జున్ బెరడు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇందులో ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి అనేక వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి.

ఇవే కాకుండా అర్జుల్ బెరడులో ఫ్లేవనాయిడ్లు, గ్లైకోసైడ్లు, ఫినోలిక్ ఆమ్లాలు, ట్రైటెర్పెనాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఇవి ఫ్రీ రాడికల్ డ్యామేజ్‌ను నివారించడంలో సహాయపడతాయి. కానీ, అర్జున బెరడును పాలలో మరిగించి తాగడం వల్ల అధిక కొలెస్ట్రాల్ సమస్యను దూరం చేసుకోవచ్చు. అధిక కొలెస్ట్రాల్‌లో అర్జున బెరడు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

అర్జున బెరడు గుండెకు టానిక్ వంటిది. కార్డియోప్రొటెక్టివ్ హెర్బ్. ఇది గుండె కండరాలను బలపరుస్తుంది. అంతేకాదు కరోనరీ ధమనుల పనితీరును మెరుగుపరుస్తుంది.ఇది ధమనులలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. మొదట రక్తంలో కలవడం ద్వారా కొవ్వు జీవక్రియ రేటును పెంచుతుంది. దాని వేడి ద్వారా చెడు కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.

అర్జున బెరడు నుండి పాలతో కార్డియాక్ టానిక్ చేయడానికి, ముందుగా అర్జున బెరడును పాలలో మరిగించండి. కాస్త చిక్కగా అయ్యేలా ఉడికించాలి. చల్లారిన తర్వాత తాగాలి. గుండె పనితీరును మెరుగుపరచడంతో పాటు, అధిక కొలెస్ట్రాల్ , అధిక బీపీ సమస్యను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.

అర్జున బెరడు అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది రక్త నాళాలను విస్తరించడానికి సహాయపడుతుంది. తద్వారా రక్తపోటును తగ్గిస్తుంది. అలాగే, ఇది రక్త ప్రసరణను సరిచేయడంలో సహాయపడుతుంది. దీంతో గుండెపై ఆకస్మిక ఒత్తిడి ఉండదు. అంతేకాదు గుండె పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

నోట్ : (ఈ కథనం సాధారణ సమాచారం కోసం, ఏదైనా నివారణను స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి)