వైద్యుల నిర్లక్ష్యం ఓ యువకుడి జీవితాన్ని తారుమారు చేసింది. డాక్టర్ల పొరపాటు ఆ యువకుడి జీవితంలో తీవ్ర ఆవేదనను మిగిల్చింది. క్యాన్సర్కు చికిత్స అందించే క్రమంలో వైద్యులు చేసిన పొరపాటుతో ఆతడు తన మర్మాంగాన్ని కోల్పోవలసి వచ్చింది. ఈ ఘటన ఫ్రాన్స్ లో జరిగింది.
ఓ యువకుడు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్స కోసం ఓ ఆస్పత్రిని అశ్రయించాడు. అతనికి వైద్యులు పరీక్షలు నిర్వహించి కార్సినోమా క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించారు. శరీరంలోని అంతర్గత అవయవాల కణజాలాలకు క్యాన్సర్ సోకడంతో చికిత్స అందించారు. అయితే ఈ క్రమంలో వైద్యులు నిర్లక్ష్యం వహించడంతో అతని మర్మాంగానికీ క్యాన్సర్ కణాలు సోకాయి. దీంతో అతడిలో కొన్ని రోజులకు తీవ్ర నొప్పితో ప్రారంభమైంది. ఆ నొప్పిని భరించలేక రోజు విలవిలాడిపోయేవాడు. చివరికి భరించలేక మర్మాంగాన్ని తానే తొలగించేందుకు ప్రయత్నించాడు. అయితే కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తీసుకెళ్లగా.. మర్మాంగాన్ని తొలగించకపోతే ప్రాణాలు పోతాయని చెప్పి వైద్యులు తొలగించేశారు.
వైద్యుల నిర్లక్ష్యంగా కారణంగానే తనకు ఇలా జరిగిందని భావించిన యువకుడు న్యాయపోరాటం చేశాడు. వారి పొరపాటు వల్లే తాను మర్మాంగాన్ని తొలగించుకోవాల్సి వచ్చిందని కోర్టులో విన్నవించుకున్నాడు. తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు అతని అభ్యర్థనను విన్న న్యాయస్థానం యువకుడికి రూ.54 లక్షలు పరిహారం ఇవ్వాలని ఆస్పత్రి మేనేజ్ మెంట్ను ఆదేశించింది. ఆ యువకుడికి ఇప్పటికే పెళ్లైంది.