ఎందుకీ నిర్లక్ష్యం..పసి ప్రాణాలకు బాధ్యులెవరు... - MicTv.in - Telugu News
mictv telugu

ఎందుకీ నిర్లక్ష్యం..పసి ప్రాణాలకు బాధ్యులెవరు…

May 20, 2017


కారు అంటే పిల్లలకు సరదా..దానిలో ఎక్కి తిరగడమే కాదు.. ఆగి ఉన్నప్పుడు అందులో ఆడుకుంటుంటారు. లోకమంతా మర్చిపోయి ఆటలాడుతారు.పాపం ఆ చిన్నారులకు తెలియదు… ఆపాయం ముంచుకోస్తుందని.. అప్పటిదాకా సరదాగా ఆడిన ఆ కారే ప్రాణం తీస్తుందని…డోర్ లాక్ రూపంలో మృత్యువు ముంచుకొస్తుందని…ఈ సమయంలో చిన్నారుల్ని ఓ కంట కనిపెట్టాల్సిన తల్లిదండ్రులు కాస్తా ఏమరపాటుగా ఉంటే….జరగరాని ఘోరం జరిగి పోతుంది. ఊహించని విషాదం గుండెలవిసేలా చేస్తుంది. ఇందులో నిర్లక్ష్యం ఎవరిది..పిల్లలు ప్రాణాలు పోవటానికి బాధ్యులు ఎవరు..కంటికి రెప్పాల్సిన చూసుకోవాల్సిన ఆ కళ్లు ఏమైపోయాయి..?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం మాణిక్యారం గ్రామానికి చెందిన రాంటెంకి సందీప్‌, రాంటెంకి నిరక్షణ్‌ కుమార్తెలు జ్ఞాపికశ్రీ(5), అబివిహ (5) బంధువుల కారులో కూర్చొని ఆడుకుంటున్నారు. ఈక్రమంలో కారు డోరు లాక్‌ అయ్యింది. దాదాపు 2 గంటలపాటు కారులో ఉన్న చిన్నారులను ఎవరూ గమనించకపోవడంతో జ్ఞాపికశ్రీ మృతిచెందగా.. అబివిహ అపస్మారక స్థితికి చేరుకుంది. చిన్నారిని విజయవాడ ఆస్పత్రికి తరలించి వైద్యం చేయిస్తుండగా శనివారం ఉదయం చనిపోయింది.
అప్పటిదాకా ఆటలాడుకున్న చిన్నారులు విగతాజీవులు కనిపించడం ఆ తల్లిదండ్రుల్ని కోలుకోలేని విషాదంలో నింపింది.వారిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. వారి బాధ వర్ణాతీతం. వారి కన్నీళ్లను తుడవలేం. కానీ రెండు గంటలుగా కారులో ఆడుకుంటున్న చిన్నారుల్ని గమనించకపోవడమే ఇంతటి విషాదానికి కారణమైంది. మరే తల్లీతండ్రి ఇలాంటి కడపుకోతకు గురికావొద్దని ఈ వార్తను ఇస్తున్నాం. కార్ డోర్ ఆటో లాక్ అయి పిల్లలు చనిపోవడం లాంటి ఘటనలు సంపన్న విదేశాల్లో తరచూ జరగుతుంటాయి. అక్కడంతా బీజీ లైఫ్..పిల్లల్ని అంతగా చూసుకునే తీరిక ,ఓపిక, టైమ్ వారికి ఉండదు. కానీ మన దగ్గర కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతుండటం అందర్నీ కలిచివేస్తోంది. చిన్నారుల్ని అల్లరుముద్దుగా పెంచుకునే తల్లీదండ్రులు… వారు ఆడుకుంటున్న సమయంలో ఓ కంట కనిపెట్టాలి. ఎంత బిజీ పనుల్లో ఉన్నా తప్పదను చూసుకోవాలి. కాస్తా ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా… ఇంట్లో చంటి దీపాలు ఆరిపోతాయి. అప్పటిదాకా ఆడుకుంటున్న చిన్నారుల్ని విగతాజీవులుగా చూడాల్సి వస్తోంది.
కారులో ఆడుకోవడం ప్రమాదమని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. వాళ్లు మరాం చేసినా..వినకపోయినా దగ్గరుండి ఆడించాలి. అంతా టైమ్ లేదంటే పనులు చేసుకుంటునే వారిని చూస్తుండాలి. కారు డోర్ ఆటోలాక్ అయినప్పుడు ఏం చేయాలో కూడా ముందే పిల్లలకు చెప్పి అప్రమత్తంగా ఉంచాలి. కొంచెం పెద్ద పిల్లలైతే అద్దాలు పగులగొట్టేలా కూడా శిక్షణ ఇవ్వాలి.
హై టెక్నాలజీ తో అదరిపోయే ఫీచర్లు ఉన్న కార్లని తయారు చేస్తున్న కంపెనీలు ….కారులో పిల్లలు ఉండగానే డోర్ ఆటో లాక్ కావడం గురించి మాత్రం పట్టించుకోవడం లేదు. ఇలా ఒకటి రెండు ఘటనలే కాదు..భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉంది. సో ఇప్పటికైనా కార్ల కంపెనీలు జర నజర్ పెడితే బెటర్. కార్లలో మనుషులు ఉంటే డోర్ లాక్ కాకుండా సెన్సర్లు రూపొందించాలి. అప్పుడే ఇలాంటి విషాదాలకు ఫుల్ స్టాప్ పెట్టొచ్చు.