ఎయిర్ టెల్ బ్రాడ్ బ్యాండ్ బాజా..! - MicTv.in - Telugu News
mictv telugu

ఎయిర్ టెల్ బ్రాడ్ బ్యాండ్ బాజా..!

May 18, 2017


జియోను తట్టుకునేందుకు భారతీ ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. 4జీ మొబైల్ డేటా సేవలతో పాటు జియో ఇప్పుడు బ్రాడ్‌బ్యాండ్‌పైనా కన్నేయడంతో.... కస్టమర్లు జారిపోకుండా ఎయిర్‌టెల్ ముందే అలర్టయింది. ఇప్పటివరకు ఉన్న డేటా ప్యాకేజీలను 100 శాతం రెట్టింపు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

ర.899 ప్లాన్ కింద ఇచ్చే 30 జీబీ హైస్పీడ్ డేటాను 60 జీబీకి పెంచింది. రూ.1099 ప్లాన్ కింద అందించే 50 జీబీ డేటాకు బదులు ఇప్పుడు 90 జీబీ డేటాను ఇస్తుంది. రూ.1299 ప్లాన్‌తో 125 జీబీ ఆఫర్ చేస్తోంది. గతంలో ఇది 75 జీబీగానే ఉండేది. ఇక ప్రిమీయం ప్లాన్ కింద రూ.1499తో అందించే 100జీబీ డేటాను 160 జీబీకి పెంచింది. గృహ వినియోగదారులకు కొత్త అనుభూతిని అందించేలా ‘వి-ఫైబర్’ సూపర్‌ఫాస్ట్ బ్రాడ్‌బ్యాండ్‌ను లాంచ్ చేసినట్టు భారతీ ఎయిర్‌టెల్ సీఈవో (హోమ్స్) హేమంత్ కుమార్ గురుస్వామి తెలిపారు.ఇప్పటికే ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుకుంటున్న కస్టమర్లు ఆటోమేటిగ్గా కొత్త ప్లాన్ల కిందికి అప్‌గ్రేడ్ అవుతారనీ... కొత్తగా చేరే వినియోగదారులు తాజా టారిఫ్‌ల కింద తమకు నచ్చిన ప్లాన్‌ను ఎంచుకోవచ్చున్నారు.