ఎవరు ఏ డ్రెస్ వేసుకుంటే మీకెందుకు : కేసీఆర్ సూటి ప్రశ్న - MicTv.in - Telugu News
mictv telugu

ఎవరు ఏ డ్రెస్ వేసుకుంటే మీకెందుకు : కేసీఆర్ సూటి ప్రశ్న

March 15, 2022

bfdb

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హిజాబ్ వివాదంపై స్పందించారు. ఎవరు ఏ దుస్తులు వేసుకుంటే ప్రభుత్వాలకు ఎందుకని ప్రశ్నించారు. ‘ ప్రజల వస్త్రధారణ ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటుంది. మతాన్ని బట్టి కూడా వస్త్రధారణ ఉంటుంది. దేశంలో మతకలహాలు రేకెత్తించడానికి బెంగళూరులో హిజాబ్ పంచాయితీ పెట్టారు. ఎవరు ఏం వేసుకుంటే మనకేం సంబంధం. ఇంత సంకుచితంగా వ్యవహరిస్తే దేశం ఎటు పోతుంది? ఎవరైనా ప్రశాంత వాతావరణం ఉంటేనే పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారు. కత్తులతో పొడుచుకు చచ్చే ప్రాంతాలకు ఎవ్వరూ రారు. ఇలాంటి సంఘటనలు ముదిరితే యువత భవిష్యత్ నాశనమవుతుంది. ఇలాంటి పెడ ధోరణులు మంచివి కావు. యూపీఏను ఓడించి ఎన్డీఏను గెలిపిస్తే దేశం ఇలా తయారైంది. బీజేపీ విధానాలతో దేశం ఎటు పోతుందో అర్థం కావడం లేదు. ఈ విషయంపై తెలంగాణ యువత ఆలోచించాలని కోరుతున్నా’ నంటూ వ్యాఖ్యానించారు.