ఏ అమ్మాయి..నువ్వే గెలిచావు, నేను చచ్చిపోతున్నా.. - MicTv.in - Telugu News
mictv telugu

ఏ అమ్మాయి..నువ్వే గెలిచావు, నేను చచ్చిపోతున్నా..

May 24, 2022

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం రొంపిచర్ల మండలం విప్పర్ల ప్రాంతానికి చెందిన మాచర్ల గోపిరాజు అనే యువకుడు తాను ప్రేమించిన అమ్మాయి కోసం చివరిసారిగా రాసిన ప్రేమలేఖ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. సొంతూరు వెళ్తున్నానని స్నేహితులతో చెప్పి, గోపిరాజు.. వినుకొండ పట్టణం దాటాక రోడ్డు పక్కనున్న చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డిన సంఘటన సంచలనంగా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. వినుకొండలో మాచర్ల గోపిరాజు కొంత కాలంగా స్నేహితులతో కలిసి పనులు చేసేవాడు. ఈ క్రమంలో ఈనెల 21వ తేదీన తాను సొంతూరు వెళ్తున్నానని స్నేహితులతో చెప్పాడు. దాంతో వారు ఎందుకు వెళ్తున్నావు? మళ్లీ ఎప్పుడు వస్తాయని ప్రశ్నించారు. దానికి గోపిరాజు ఎలాంటి సమాధానాలు చెప్పకుండా ఊరికే వెళ్తున్నా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం పట్టణం చివరి దాకా వెళ్లి, రోడ్డు పక్కన ఉన్న ఓ చింతచెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

దాంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తుండగా ఆత్మహత్యకు గల అసలు కారణం బయటపడింది. ”ఆత్మహత్యకు ముందు అతను ఓ లేఖ రాశాడు. ముందుగా తన మృతదేహాన్ని తన అన్నకు అప్పగించాలని ఫోన్ నంబరు రాశాడు. ఆ తర్వాత ప్రేయసిని సంబోధిస్తూ కవిత్వం రాశాడు. ‘ఏ అమ్మాయి నువ్వే గెలిచావు. నేనే ఓడిపోయా. నేను ఏ తప్పూ చేయలేదు. నేను ఎప్పుడూ ఓడిపోలా. అపుడే ఓడిపోయా. ఈ జన్మకు నీవే నా భార్య అని ఊహించుకున్నా. కానీ నాకు ఆ అదృష్టం లేదు. నేను నిన్ను మర్చిపోలేకపోతున్నా. మర్చిపోవాలంటే ముందు చచ్చిపోవాలి. ఐ మిస్ యూ. లైఫ్‌లో ఎప్పుడూ కనిపించను. ‘నా చావుకు నేనే కారణం’ అని లేఖ ముగించినట్లు పోలీసులు తెలిపారు. ఇది చూసినవారంతా ప్రేమ కోసం ప్రాణాలు తీసుకోవటం ఏంటని చర్చించుకుంటున్నారు.