ఓవర్ స్పీడ్ వెళ్తే జైలుకే.. బీకేర్ ఫుల్ బైక్ రైడర్స్... - MicTv.in - Telugu News
mictv telugu

ఓవర్ స్పీడ్ వెళ్తే జైలుకే.. బీకేర్ ఫుల్ బైక్ రైడర్స్…

May 26, 2017

బైక్ పై వేగంగా వెళ్తున్నారా.. అర్దరాత్రి మరి ఓవర్ స్పీడా…మీటర్ రీడింగ్ వంద దాటేస్తుందా..అయితే మీకో హెచ్చరిక.. ఇకపై అలా వెళ్తే డైరెక్ట్ గా జైల్లో కూర్చోవాల్సిందే. హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ పై అర్దరాత్రి అతివేగంగా వెళ్లిన ముగ్గురు రైడర్లకు రెండురోజుల జైలు శిక్ష పడింది. మరో ఇద్దరి సోషల్ సర్వీసు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది.
అసలే హెవీ ట్రాఫిక్…ఈవెనింగ్ అవర్స్ లోనైతే టుమాచ్. ఈ టైమ్ లో కూడా కొందరు బైక్ రైడర్లు మెల్లగా కదులుతోన్న సందుల్లో అతివేగంగా వెళ్తున్నారు. స్పోర్ట్స్ బైక్ లపై ఓవర్ స్పీడ్ తెగ ఫోజులు కొడుతుంటారు. పీక్స్ అవర్స్ లోనే మిడ్ నైట్ అయితే ఇలాంటోళ్లకు అడ్డు అదుపూ ఉండదు. బైక్ స్టార్ట్ అయిదంటే సర్రున్న మీటర్ వందదాటాల్సిందే. కుర్రకారు రేసులు కూడా నిర్వహిస్తున్నారు. వీరిని పనిపట్టేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. సిటీలో పలు ప్రాంతాల్లో ఈ డ్రైవ్ చేపట్టారు.
మంగళవారం అర్దరాత్రి ట్యాంక్ బండ్ అతివేగంగా వెళ్తున్న ఐదుగురిని పట్టుకున్నారు. ఇద్దరు కుర్రాళ్లు వంద కిలోమీటర్ల స్పీడ్ దాటితే..మరో ముగ్గురు సుమారు వంద కిలోమీటర్ల స్పీడ్ వెళ్తూ చిక్కారు. అతి వేగంగా వెళ్లిన వీరిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. వందకిలోమీటర్ల స్పీడ్ దాటిన ఇద్దరికి ఒకరోజు శిక్ష. మరోకరికి రెండు రోజుల శిక్షను కోర్టు విధించింది. శిక్షతో పాటు వెయ్యి రూపాయల జరిమానా కూడా వేసింది. మిగతా ఇద్దరికి వెయ్యి రూపాయల జరిమానాతో పాటు రెండురోజులు సోషల్ సర్వీసు చేయాలని ఆదేశించింది. ట్రాఫిక్ కూడళ్లలో ఓవర్ స్పీడ్ వెళ్లొద్దని ట్రాఫిక్ రూల్స్ రాసి ఉన్న ప్ల కార్డులతో ప్రదర్శన చేయించారు.
ఓవర్ స్పీడ్ వల్ల జరగుతున్న ప్రమాదాల్ని అరికట్టేందుకే స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ప్రతిరోజూ అర్దరాత్రి 12 గంటల నుంచి 2గంటల వరకు నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్ లో రోజు 10 మంది దాకా పట్టుబడుతున్నారు. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 6వేల 446 ట్రాఫిక్ చలానాలు జారీ అయ్యాయి. గతేడాది 10 వేలకు పైగా చలానాలు ఇష్యూ చేశారు. ట్యాంక్ బండ్ , కేబీఆర్ పార్క్, బోయిన్ పల్లి చెక్ పోస్టు , పీవీ ఎక్స్ ప్రెస్ హైవే పై ఎక్కువగా ఓవర్ స్పీడింగ్ కేసులు నమోదవుతున్నాయి.
సో బైక్ రైడర్స్ బీ అలర్ట్.. అతి వేగంగా వేళ్లే డైరెక్ట్ గా జైలుకు వెళ్లాల్సిందే.