Kurnool District police smashed and destroyed illegal liquor bottles with road roller jagan
mictv telugu

కర్నూలులో రూ. 2 కోట్ల మద్యం ధ్వంసం

July 9, 2022

 

Kurnool District police smashed and destroyed illegal liquor bottles with road roller

అనుకోకుండా ఒక మద్యం బాటిల్‌ పగిలితేనే మందు బాబుల గుండె బద్ధలవుతుంది. అలాంటిది కొన్ని లక్షల కళ్లు చూస్తుండగా వేలాది మందు సీసాలను రోడ్‌ రోలర్‌లతో తొక్కించి, ధ్వంసం చేస్తుంటే వారి బాధ వర్ణనాతీతం. ఏపీలో అక్రమ మద్యంపై పోలీస్ యంత్రాంగం ఉక్కుపాదం మోపుతోంది.. పట్టుబడిన కోట్ల రూపాయల విలువైన అక్రమ మద్యాన్ని రోడ్డు రోలర్లతో తొక్కిస్తూ మట్టిలో కలిపేస్తున్నారు పోలీసులు. తాజాగా కర్నూల్ జిల్లాలో పెద్దఎత్తున ఇల్లీగల్‌ లిక్కర్‌ను అధికారులు డిమోలిషన్‌ చేశారు. అక్రమ మద్యం సీసాలను రోడ్డుపై క్రమపద్ధతిలో పేర్చి రోడ్డు రోలర్ సహాయంతో ధ్వంసం చేశారు.

కర్నూలు జిల్లాలోని పంచలింగాల గ్రామం నుంచి ఈ.తాండ్రపాడుకు వెళ్లే మార్గంలో 66వేల అక్రమ మద్యం సీసాలను జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. 593 కేసుల్లో పట్టుబడిన వీటి విలువ సుమారు రూ.2కోట్లు ఉంటుందని ఆయన తెలిపారు. నాటుసారా, మద్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్నవారిపై గట్టి నిఘా ఉంచి కట్టడి చేయాలని పోలీసులకు సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ప్రసాద్, ఏఈఎస్ ఇన్‌ఛార్జి రాజశేఖర్, కర్నూలు సబ్‌స్టేషన్ సీఐ సత్యనారాయణ పాల్గొన్నారు. ధ్వంసం చేసిన బాటిల్స్ లో స్కాచ్ బాటిల్స్ కూడా ఉండటం విశేషం. మద్యనిషేధం తెస్తామని సీఎం జగన్ చెబుతున్నా రాష్ట్రంలో అక్రమ మద్యం వెల్లువెత్తుండడం విశేషం. మద్యం వ్యాపారంలో అధికారిక పార్టీ నేలదే సింహభాగమని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే.