ఉత్తరప్రదేశ్లోని హాపుడ్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ధౌలానా పోలీస్ స్టేషన్ పరిధిలోని పారిశ్రామిక కేంద్రంలో బాయిలర్ పేలుడుతో పెద్ద ఎత్తున మంటలు అలుముకున్నాయి. ఈ దుర్ఘటనలో 9 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 19 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక విభాగం.. ఆరు అగ్నిమాపక యంత్రాలతో సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. పేలుడు దాటికి పరిశ్రమ పూర్తిగా ధ్వంసమైంది. క్షతగాత్రులను ఆసుపత్రుల్లో చేర్పించినట్లు అధికారులు తెలిపారు. అందులో పలువురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోడీ, యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్ ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. సీఎం యోగి ఆదేశాలతో హాపూర్ జిల్లా కలెక్టర్ మేఘ, ఇతర అధికారులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించినట్టు వెల్లడించారు.
9 labors killed in blast at factory in UP’s Hapur, PM condoles deaths
9 labors died , 19 were injured , boiler blast , manufacturing factory , Hapur district , Uttar Pradesh , Saturday, rescue operations , PM Modi, UP CM Yogi