కేన్స్ లో మల్లిక సందడి - MicTv.in - Telugu News
mictv telugu

కేన్స్ లో మల్లిక సందడి

May 18, 2017


బాలీవుడ్ బ్యూటీ మ‌ల్లికా శెరావ‌త్ కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్ లో సంద‌డి చేసింది. పొడ‌గాటి గౌన్ తో అందరినీ ఆకట్టుకుంది. 40 ఏళ్ళ ఈ గ్లామ‌ర్ బ్యూటీ ప్రతిష్ఠాత్మక 70వ కేన్స్‌ చలన చిత్రోత్సవంలో పాల్గొన‌డంతో ఆమె అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. త‌న అభిమానులని మ‌రింత ఆనంద‌ప‌రిచేందుకు త‌న
ఇన్ స్ట్రాగ్రామ్ లో కొన్ని ఫోటోల‌ను పెట్టింది. మే 28 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న కేన్స్ ఫెస్టివ‌ల్ లో దీపిక ప‌దుకొణే ఇప్పటికే పొల్గొన‌గా ,ఐశ్వర్యతో పాటు సోనమ్‌ కపూర్‌ కూడా పాల్గొనబోతున్నారు. తొలిసారి సౌత్ నుంచి శృతి హాసన్ కేన్స్ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొననుంది. సుందర్ సి తెరకెక్కించనున్న సంఘమిత్ర చిత్రం ఫస్ట్ లుక్ ని కేన్స్ లో విడుదల చేయనుంది.