కేసీఆర్‌పై ఆప్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్‌పై ఆప్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

March 4, 2022

hbfgb

కేంద్రంలోని అధికార బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టే ప్రయత్నాల్లో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అప్పుడే విమర్శలు మొదలయ్యాయి. ఢిల్లీలోని ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి శుక్రవారం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక మీడియాతో సోమనాథ్ మాట్లాడుతూ.. ‘తెలంగాణ ఉద్యమకారులను, యువతను, దళితులను కేసీఆర్ మోసం చేశారు. దళిత సీఎం, మూడెకరాల భూమి వంటి హామీలతో దళిత ఓట్లతో అధికారంలోకి వచ్చి వారికి నమ్మక ద్రోహం చేశారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రతీ పథకంలో అవినీతి ఉంది. ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోయి, ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతో ఫ్రంట్ అంటూ తిరుగుతున్నారు. దేశంలోని ప్రతి పార్టీ తమ తమ వ్యక్తిగత ఎజెండాతో ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధాని మోదీకి వ్యతిరేకమైన ఫ్రంట్ దేశంలో అవసరం లేద’ని తెలిపారు. కాగా, ఈ వ్యాఖ్యలతో కేసీఆర్ ప్రయత్నిస్తున్న మూడో ఫ్రంట్‌కు కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ మద్ధతు లేదని స్పష్టమవుతోంది.