కోడిగుడ్లను మింగి.. చిక్కి.. కక్కిన తాచుపాము - MicTv.in - Telugu News
mictv telugu

కోడిగుడ్లను మింగి.. చిక్కి.. కక్కిన తాచుపాము

April 14, 2018

కోళ్ళ వాసనకు పాములు వస్తాయని అంటారు. అది నిజమే అంటారు ఇది చూస్తే. కేరళలోని వేనాడ్‌లో ఓ ఇంటి ఆవరణలో వున్న కోళ్ళగూడులోకి తాచుపాము చొరరబడింది. అందులో ఓ కోడి  గుడ్లను పొదుగుతోంది. ఒకేసారి గుడ్లను హాంఫట్ అనిపించొచ్చు అనుకున్నట్టుంది సదరు సర్పం.

అయితే ఈ కోడి రచ్చ చేసింది. కానీ పాము పట్టించుకోకుండా  గుడ్లను మింగడం మొదలు పెట్టింది. ‘అయ్యో.. అయ్యో.. ఈ ఎదవసచ్చిన  పామొచ్చి నా గుడ్లను మింగేస్తోంది. ఎవరైనా వచ్చి కాపాడండి మొర్రో ’ అన్నట్లు  ఆ తల్లికోడి అరవటం ఇంకా ఎక్కువ చేసింది. దీంతో ఇంట్లోవాళ్ళు కంగారుగా బయటకు వచ్చి చూశారు. వెంటనే స్నేక్ క్యాచర్‌ను పిలిచారు.  అతను ఎంతో చాకచక్యంగా ఆ పామును బయటకు తీశాడు.

‘వామ్మో.. గుడ్లు మింగిన పాపానికి వీళ్ళు నన్ను చంపేసినా చంపేస్తారు.. ’ అనుకుందేమో ఆ పాము. వెంటనే గుడ్లను ఎంత ఫాస్టుగా మింగిందో అంతే ఫాస్టుగా కక్కటం మొదలు పెట్టింది. మింగిన ఏడు గుడ్లను కక్కి సర్రుమని అక్కడినుంచి పొదల్లోకి జారుకుంది. ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది.