క్వాలిఫయర్-2లో నైట్‌రైడర్స్ ఓటమిపై గౌతమ్ గంభీర్ తెగ ఫీల్ అయ్యాడు. పట్టలేని భావోద్వేగంతో అభిమానులకు ట్విటర్ లో సందేశం పంపాడు.
బెంగళూరు చిన్నస్వామి వేదికగా ముంబయి ఇండియన్స్‌తో శుక్రవారం జరిగిన క్వాలిఫయర్-2లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గంభీర్ సేన 18.5 ఓవర్లకు 107 పరుగులకు ఆలౌటైంది. కరణ్ శర్మ (4/16), బుమ్రా (3/7) ఆ జట్టును భారీ దెబ్బకొట్టారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ముంబయి ఆడుతూ పాడుతూ 14.3 ఓవర్లకు 4 వికెట్ల నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. క్రునాల్ పాండ్యా (45; 30 బంతుల్లో 8×4) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఐపీఎల్-10లో నైట్‌రైడర్స్ ప్రస్థానం ముగియడంతో గంభీర్ ట్విటర్లో అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. ‘కోల్‌కతా నైట్‌రైడర్స్ పట్ల మీ ఎనలేని ఆదరణకు వందనాలు. మీ అందరికీ చెప్పేదొకటే ఈ ప్రస్థానం ఒక సరదా కాదు. శక్తి వంచన లేకుండా పోరాడాం. ఐతే మా అత్యుత్తమ పోరాటం సరిపోలేదనుకుంటున్నా’ అని ట్వీట్ చేశాడు గంభీర్.
Tks for being a wonderful support 4 @KKRiders,but 4 u all this journey won't have been fun. Tried our best may b our best wasn't good enuff.
— Gautam Gambhir (@GautamGambhir) May 20, 2017