ఛీఛీ.. ఇంతగా దిగజారుతారా?.. శ్రీకాంత్ - MicTv.in - Telugu News
mictv telugu

ఛీఛీ.. ఇంతగా దిగజారుతారా?.. శ్రీకాంత్

March 9, 2018

సినీ నటుడు శ్రీకాంత్‌కు  కోపం వచ్చింది. తన గురించి అసత్య వార్తలను, వీడియోలను పెడుతున్న యూట్యూబ్, వెబ్‌సైట్స్‌పై అతడు విరుచుపడ్డాడు. శ్రీకాంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడంటూ యూట్యూబ్‌లోని కొన్ని చానళ్లలో వార్తలు వచ్చాయి.  దీనిపై శ్రీకాంత్ స్పందిస్తూ.. ‘నేను బెంగళూరు షూటింగులో బీజీగా ఉన్నాను.. నాకు ఉదయం నుంచి ఒకటే ఫోన్లు.. మీకు యాక్సిడెంట్ అయ్యిందట కదా! ఎలా ఉంది? ప్రాణాపాయమేమీ లేదు కదా.. అని ఫోన్ చేస్తున్నారు. హైదరాబాదులో ఉన్న నా కుటుంబ సభ్యులకు ఈ  సమాచారం తెలిసి చాలా కంగారు పడ్డారు’ అని తెలిపారు.‘యూట్యూబ్ చానల్ వాళ్ళు  లైకులు, సబ్‌స్క్రైబర్స్ కోసం  మరీ ఇంతగా దిగజారుతారా? తప్పుడు సమాచారంతో వీడియోలు చేసి, వార్తలు పెట్టడం చాలా పెద్ద తప్పు. ఇలా తప్పుడు సమాచారాలను అందిస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇకపై ఎవరూ ఇలాంటి అసత్య వార్తలు రాయొద్దు. ఏదో ఓ చానెల్ చెప్పే కట్టుకథలు చూసి, మిగతా వెబ్‌సైట్లు, యూట్యూబ్ చానెళ్లు, పత్రికల వారు అదే వార్త రాస్తున్నారు. అది నిజమా  కాదా అని కూడా ఆలోచించడం లేదు. మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ (మా) కూడా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తుంది. ఈ మేరకు అసత్య ప్రచారం చేస్తున్న సైట్లపై పోలీసులకు ‘మా’ ఫిర్యాదు చేసింది’ అని శ్రీకాంత్ తెలిపారు.