జూనియర్ కలామ్ - MicTv.in - Telugu News
mictv telugu

జూనియర్ కలామ్

May 18, 2017


మాజీ రాష్ట్ర‌ప‌తి అబ్దుల్ క‌లామ్ పేరు మీద తమిళనాడు విద్యార్థి త‌యారు చేసిన అతిచిన్న ఉప‌గ్ర‌హాన్ని నాసా నింగిలోకి పంపబోతోంది. ఆ శాటిలైట్‌కు క‌లామ్‌శాట్ అని పేరు పెట్టారు. ఆ ఉప‌గ్ర‌హం బ‌రువు కేవ‌లం వంద గ్రాములే. దీన్ని 18 ఏళ్ల రిఫ‌త్ షారూక్ అనే 12వ త‌ర‌గ‌తి విద్యార్థి చేశాడు. గ‌తంలో నాసా క్యూబ్స్ ఇన్ స్పేస్ పోటీని నిర్వ‌హించింది. .

ఈ పోటీలో పాల్గొన్న త‌మిళ‌నాడు కుర్రాడు క‌లామ్‌శాట్ శాటిలైట్‌ను రూపొందించాడు. కార్బ‌న్ ఫైబ‌ర్ పాలిమ‌ర్‌తో త‌యారైన ఆ శాటిలైట్ స్మోర్ట్‌ఫోన్ క‌న్నాబ‌రువు త‌క్కువ‌గా ఉంటుంది. జూన్ 21న వాల‌ప్స్ దీవి నుంచి నాసా ఉప‌గ్ర‌హాన్ని ప్ర‌యోగించింది. త్రీడీ ప్రింట్ కార్బ‌న్ ఫైబ‌ర్ ప‌నితీరును తెలుసుకునేందుకు చిన్న‌సైజు శాటిలైట్‌ను ప్ర‌యోగించ‌నున్న‌ట్లు రిఫత్ షారుక్ తెలిపాడు.

Indian Teen Makes World's Lightest Satellite For NASA

NASA – National Aeronautics and Space Administration will launch Rifath's satellite on June 21

Posted by ScoopWhoop Unscripted on Tuesday, 16 May 2017