ట్విట్టర్ 'కోటి'గాడు.. - Telugu News - Mic tv
mictv telugu

ట్విట్టర్ 'కోటి'గాడు..

May 24, 2017

ప‌వ‌ర్‌ఫుల్ పంచ్‌లు, సెటైర్ల‌తో నెటిజ‌న్ల‌ను ఎంట‌ర్‌టైన్ చేసే వీరేంద్ర సెహ్వాగ్‌ ట్విట్టర్ కరోడ్ పతి అయ్యాడు. ట్విట్ట‌ర్‌లో అత‌ని ఫాలోవ‌ర్స్ సంఖ్య ఇప్పుడు కోటి దాటింది. ఫాలోవ‌ర్స్ సంఖ్య కోటి దాటిన‌ట్లు అత‌నే ట్వీట్ చేశాడు.. అది కూడా త‌న‌దైన స్టైల్లో సెల‌బ్రేట్ చేసుకున్నాడు. త‌న‌ను ట్విట్టర్ క‌రోడ్‌ప‌తిని చేసినందుకు కోటి మందికి కోటి కృత‌జ్ఞ‌త‌లు అని వీరూ ట్వీట్ రూపంలో చెప్పాడు.