కేసీఆర్ అభద్రతతో మాట్లాడుతున్నారు...! - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ అభద్రతతో మాట్లాడుతున్నారు…!

August 3, 2017

చిల్లర మాటలు మాట్లాడే అతను..తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి గా దొరకడం దౌర్భాగ్యం,అధికార మదం తో కెసిఆర్ మాట్లాడడాన్ని ఖండిస్తున్నా,కెసిఆర్ అభద్రత తో మాట్లాడారు కాంగ్రెస్ అంటే భయం మొదలైంది,కెసిఆర్ మాటలు పచ్చి అబద్ధాలు దిగజారుడు మాటలు, సిగ్గులేని మాటలు,ఎలక్ట్రిసిటి విషయంలో కాంగ్రెస్ వాళ్ళు కోర్ట్ కి వెళ్లారు అనడం శుద్ధ అబద్ధం. కేసు వేసిన వారు కాంగ్రెస్ కి ఎలాంటి సంబంధం లేదు,తెలంగాణ జాగృతి తో సంబంధం వున్న నాయకుడు సింగరేణి వారసత్వ ఉద్యోగాల పై కోర్ట్ కి వెళ్ళాడు,ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్న హామీ ఏమైంది?

మీరాకుమార్ గురించి అనుచితంగా మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలి.కళ్ళు నెత్తికి ఎక్కి మాట్లాడుతున్నాడు,మీరాకుమార్ కి తక్షణమే క్షమాపణలు చెప్పాలి,కెసిఆర్ కుటుంబ సభ్యుల ప్రోద్బలం తోనే నేరేళ్లలో దలితుల పై థర్డ్ డిగ్రీ జరిగింది,హర్ష మోటార్స్ నుండి హిమాన్షు కంపనీ 300వాహనాలు కొనుగోలు చేసింది వాస్తవం, 3సంవత్సరాలు చేసిన దోపిడికి కెసిఆర్ ముక్కు నేలకి రాయాలి,తెలంగాణ ప్రాజెక్టులని ఆంధ్రా కాoట్రాక్టర్ల కి ఎందుకు ఇస్తున్నారు,కెసిఆర్ మాట్లాడిన మాటలు సభ్య సమాజం తెలంగాణ ప్రజలంతా ఖండిస్తుంది,3 సంవత్సరాలలో హైదరాబాద్ లో 50పబ్ లకి పర్మిషన్ ఇచ్చిన ఘనత తెరాస ప్రభుత్వానిదే,తెరాస ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక్క యూనిట్ విద్యుత్ కూడా ఉత్పత్తి చేయలేదు,తెరాస ప్రభుత్వం మొదలు పెట్టిన ప్రాజెక్టు పూర్తయి ఒక్క నీటి చుక్క అయినా విడుదల చేశారా?

రైతుల ఆత్మహత్యల్లో,అప్పుల్లో దేశంలోనే రాష్ట్రం నెంబర్ 1,సోనియా గాంధీ కాళ్ళు పట్టుకుని మీవళ్ళే తెలంగాణ వచ్చింది అని మాట్లాడినది కెసిఆర్ కాదా?తెరాస పార్టీలో కెసిఆర్ అసమ్మతి ఎమ్మెల్యే లు ఉన్నారు,2బెడ్ రూమ్ గృహాలు,12%మైనారిటీ రిజర్వేషన్లు,దళితులకి 3ఎకరాల భూమి విషయంలో కాంగ్రెస్ అడ్డుకుందా?ఎందుకు అమలు చేయలేదు,అవకాశవాద రాజకీయాలకి కెసిఆర్ పరాకాష్ట,మోడీ ని చూసి కెసిఆర్ ఎందుకు బయపడుతున్నాడో వివరణ ఇవ్వాలి,కెసిఆర్ మాట్లాడిన మాటలన్నీ శుద్ధ అబద్ధాలు,న్యాయం కోసం కడుపుమండిన బాధితుడు న్యాయస్థానం కి వెళ్తే కాంగ్రెస్ పై నిందలు వేయడం దుర్మార్గం,ఇప్పటికైనా ప్రజల్లో తిరుగుతా అని సీఎం కెసిఆర్ అనడం సంతోషం,ఒడిపోతామేమో అనే భయం తోనే నిర్లక్ష్యం గా కెసిఆర్ మాట్లాడారు