ట్విట్టర్ ఖాతా నుండి సస్పెండ్ అయిన తరువాత తొలిసారి బాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్. తన ఇన్స్టాగ్రామ్లో ఆశా భోంస్లే యొక్క వీడియోను షేర్ చేస్తూ హిందీ నటీ నటులపై ఎప్పటిలానే విరుచుకుపడింది. తానూ డబ్బుల కోసం ఏదిపడితే అది చేయనని.. కానీ అందరు చేస్తారని చెప్పింది. ఆశ భోస్లే వీడియోలో తన అక్క లెజెండరీ సింగర్ దివంగత లతా మంగేష్కర్ మాట్లాడటం కనిపిస్తుంది. లతా చెప్పిన కామెంట్స్ ని ఉదహరిస్తూ.. డబ్బులు ఇస్తామంటే చాలు మన బాలీవుడ్ హీరోలు, హీరోయిన్స్ ప్రైవేట్ పార్టీలు, వివాహాలకు వెళ్లి చిందులేస్తారు. కానీ నేను అలా చేయను. ఎంత పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వాలని ప్రయత్నించినా నేను ఆఫర్స్ ని రిజెక్ట్ చేశానని చెప్పుకొచ్చింది కంగనా.
ఇక కంగనా షేర్ చేసిన వీడియోలో.. లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్కు ఒకప్పుడు పెళ్లిలో పాడేందుకు మిలియన్ డాలర్లు ఆఫర్లు చేసినా ఎలా తిరస్కరించింది? అనే విషయం గురించి మాట్లాడింది. తమ పెళ్లిలో కేవలం రెండు గంటలు పాడేందుకు 5 మిలియన్ డాలర్లు ఆఫర్లు ఇవ్వజూపినా తిరస్కరించిందని తెలిపింది. ఈ నేపథ్యంలో కంగనా మాట్లాడుతూ.. ‘లతాజీ మీరు చాలా గ్రేట్. మీరే నాకు స్ఫూర్తి. తాను కూడా ఎటువంటి ప్రైవేట్ ఈవెంట్స్ లేదా పార్టీల్లో డ్యాన్స్ చేయలేదు’ అని పేర్కొంది. కాగా.. కంగన తన స్వీయ దర్శకత్వంలో ‘ఎమర్జెన్సీ’ సినిమా చేస్తోంది. ఈ సినిమాలో ఆమె మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్ర పోషిస్తుండగా.. షూటింగ్ పిక్స్, వీడియోలను రెగ్యులర్గా షేర్ చేస్తోంది.