అమెరికాలో ఉగ్రవాదుల దాడి - MicTv.in - Telugu News
mictv telugu

అమెరికాలో ఉగ్రవాదుల దాడి

November 1, 2017

అమెరికాలోని లాస్‌వేగాస్‌లో ఓ సైకో నరమేధం మరవక ముందే, న్యూయార్క్‌లో మరో ఉగ్రదాడి అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. న్యూయార్క్‌లోని  డబ్ల్యూటీసీ స్మారక చిహ్నం ప్రాంతంలో ఓ ఉగ్రవాది  ట్రక్కును నడుపుతూ ఒక్కసారిగా సైకిళ్లు వెళ్లే మార్గంలోకి  వేగంగా దూసుకెళ్లి,  కనిపించినవారిని ట్రక్కుతో ఢీకొట్టుకుంటూ  బీభత్సం సృష్టించాడు.

ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా, 11 మందికి  తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ట్రక్కు డ్రైవర్ పై కాల్పులు జరిపి, అతన్ని అదుపులోకి తీసుకున్నారు.  ట్రక్కులో ఐసిస్‌కు సంబంధించి ఓ లేఖ ఉండడంతో, ఇది ఖచ్చితంగా ఉగ్రవాదుల  దాడేనని  పోలీసులు నిర్ధారించారు.

ఈఘటనపై  భారత రాష్ట్రపతి ,ప్రధాని మోడీ మండి పడ్డారు. ‘న్యూయార్క్‌లో ఉగ్రవాది దాడి  దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అమెరికాకు భారత్‌ అండగా ఉంటుంది.’ అని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్  ట్వీట్‌ చేశారు. ‘న్యూయార్క్‌లో ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఘటన నుంచి బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా.’ అని మోదీ ట్వీటర్‌ ద్వారా సానుభూతిని వ్యక్తం చేశారు.