తెలంగాణలో తగ్గని కరోనా వ్యాప్తి.. నిన్నటి కేసుల వివరాలు  - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో తగ్గని కరోనా వ్యాప్తి.. నిన్నటి కేసుల వివరాలు 

September 24, 2020

kjrg

తెలంగాణలో చాలా రోజులుగా 2 వేలకు తగ్గకుండా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు జిల్లా స్థాయిలోనూ ఎక్కువగానే బాధితులను గుర్తిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,176 మందికి వ్యాధి నిర్ధారణ అయింది. 8 మంది మృతి చెందారని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఒక్కరోజే 55,318 పరీక్షలు చేయగా.. ఈ స్థాయిలో లక్షణాలు బయటపడ్డాయి. నిన్న 2,004 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 82.64 శాతానికి చేరింది. 

రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,79,296 మందికి వ్యాధి సోకింది. వీరిలో 1070 మరణాలు సంభవించాయి. 1,48,139 మంది బాధితులు కోలుకోగా.. ఇంకా 30,037 మంది వైరస్‌తో బాధపడుతున్నారు. మొత్తం 26,84,215 శాంపిళ్లను వైద్యులు పరీక్షించారు. 23,929 మంది హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారు. మిగితా వారు మాత్రమే వివిధ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. నిన్న అత్యధికంగా జీహెచ్ఎంసీ 308, రంగారెడ్డి 168, మేడ్చల్‌లో 151 కేసులు నమోదు అయ్యాయి.