దినకూలిని తొక్కి చంపిన పోలీసు బండి.. ఏ శిక్ష వెయ్యాలి?
Editor | 6 Sep 2019 9:00 AM GMT
మాటెత్తితే చాలు ట్రాఫిక్ రూల్స్, చలానాలు, బొంగుబొషాణం అని వాగే పోలీసులు తమదాకా వస్తే మాత్రం విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. చివరకు సామాన్యుల ప్రాణాలను సైతం బలితీసుకుంటున్నారు. పోలీసు బస్సు ఒకటి నడిరోడ్డుపై పట్టపగలు ఓ దినకూలిని గుద్ది చంపింది. తమిళనాడులోని కోయంబత్తూరులో ఈరోజు(శుక్రవారం) ఈ దారుణం జరిగింది.
కళ అనే 55 ఏళ్ల మహిళ రాజా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. అప్పటివరకు ఆగి ఉన్న పోలీసు బస్సు ఉన్నట్టుండి కదిలింది. కళ ప్రాణభయంలో పరుగులు తీసింది. అయినా పోలీసు బండి ఆగకుండా ఆమెను ఢీకొట్టి, అక్కడికక్కడే చంపేసింది. ఈ దృశ్యాలు అక్కడి సీసీకెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ప్రమాదంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్సు నడిపిన పోలీసు సిబ్బందిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Updated : 6 Sep 2019 9:16 AM GMT
Next Story
© 2017 - 2018 Copyright Telugu News - Mic tv. All Rights reserved.
Designed by Hocalwire