సిల్వర్ స్క్రీన్ పై కనిపించాలంటే దేనికైనా ఓకే అనాల్సిందేనా…అవకాశాలకోసం వెళ్లిన అమ్మాయిల్ని కొందరు ఫిల్మ్ మేకర్స్ ఇబ్బందులు పెడుతున్నారా.. ఆఫర్స్ ఇవ్వమని అడిగితే లైంగిక కోరికలు తీర్చాలని అంటున్నారా… లైంగిక వేధింపులపై సెలబ్రిటీ లు చెబుతున్న మాటల్ని అవుననే అనిపిస్తుంది.
ఫిల్మ్ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు మరో భామ నోరు విప్పింది. కొందరు ఫిలిం మేకర్స్ ని ఆఫర్స్ ఇవ్వమని అడిగితే, లైంగిక సుఖాలు కావాలని ఇబ్బంది పెడతున్నట్టు రాయ్ లక్ష్మీ నిర్మొహమాటంగా చెప్పింది. ఇది ఎప్పటి నుంచో నడుస్తుందన్న ఆమె, తనకెప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదని అంటోంది. ‘‘ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తమ్మాయిలు, హిట్ కోసం స్ట్రగుల్ అవుతున్న హీరోయిన్లను నిర్మాతలు, ఫిల్మ్ మేకర్స్ పీడిస్తున్నారు. కొందరు ఫిల్మ్ మేకర్స్ ఇండస్ట్రీకి సరాదాల కోసం, సుఖాలు అనుభవించడం కోసం వస్తారు’’ అని రత్తాలు రాయ్ లక్ష్మీ చెబుతోంది. ఎన్నో ఆశలతో రంగుల ప్రపంచలోకి వస్తే ఇలా ఇబ్బంది పెట్టడం మంచిది కాదంటోంది.