దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ.. ఫోన్లు, పర్స్‌లు.. - MicTv.in - Telugu News
mictv telugu

దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ.. ఫోన్లు, పర్స్‌లు..

April 22, 2022

27

ముంబై-సికింద్రాబాద్‌‌ల మధ్య నడిచే రైలులో గురువారం అర్ధరాత్రి ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రయాణంలో ఉన్న దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ జరిగింది. కొంతమంది దుండగులు ట్రైన్‌లోకి చొరబడి, బోగీల్లోని ప్రయాణికులను బెదిరించి, వారి దగ్గర నుంచి ఫోన్లు, పర్స్‌లు, ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటన దౌల్తాబాద్ పోతుల్ మధ్య జరిగింది. అయితే, దుండగులు సిగ్నల్‌‌కి ఓ వస్త్రాన్ని కట్టి రైలు ఆగేలా చేశారు. ఆగిన వెంటనే రైలుపై రాళ్లు విసిరారు. దాంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

అనంతరం నలుగురైదుగురు దొంగలు బోగీల్లోకి వెళ్లి, ప్రయాణికులను కత్తులతో బెదిరించారు. వారి దగ్గర నుంచి బంగారు నగలు, మొబైల్ ఫోన్లు లాక్కెళ్లారు. దాంతో ప్రయాణికులు భయంతో పెద్దగా కేకలు పెట్టారు. ముఖ్యంగా ఎస్ 5, ఎస్ 9 కోచ్‌లను టార్గెట్ చేశారు. ఈ విషయం అర్థం చేసుకున్న మిగతా బోగీల్లోని ప్రయాణికులు వెంటనే డోర్స్‌ను క్లోజ్ చేసేశారు. మొత్తం పదిమంది ఓ గుంపుగా అటాక్ చేసి, ఈ దొంగతనాలకు పాల్పడ్డారు. దీనికోసం వారు ఓ అంబులెన్స్‌ను వినియోగించుకున్నారు. అయితే, ఈ సంఘటనపై ట్రైన్ డ్రైవర్‌ స్టేషన్ మాస్టర్‌కు తెలియజేశాడు. దీంతో రైల్వే పోలీసులు, రైల్వే ఉన్నతాధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు మొదలుపెట్టారు.