నిజాలు చెబితే సస్పెండ్ చేశారు! - MicTv.in - Telugu News
mictv telugu

నిజాలు చెబితే సస్పెండ్ చేశారు!

May 18, 2017


ఖాఖీ డ్రెస్సు వేస్తే ఎవరైనా ఒకటే. మానవత్వాన్ని మరిచిపోతారు. నరనరాల్లో కరుకుదనం నిండిపోతోంది. కానీ ఆమె మనుసున్న పోలీస్ ఆఫీసర్.ఆదివాసీ బాలికల్ని పెడుతోన్న టార్చర్ ని చూసి చలించిపోయింది. సోషల్ మీడియా వేదికగా నిజాల్ని బయటపెట్టారు. సాటి మనిషిలా ఆలోచించడమే ఆమె చేసిన తప్పయింది. ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ వ్యవహరించిన తీరు సర్కార్ కు కోపం తెప్పిస్తే… జనానికి మాత్రం నచ్చింది.

వర్షా డోంగ్రే ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ జైలు డిప్యూటీ సూపరింటెండెంట్. గతంలో ఓ దారుణ అనుభవాన్ని ఆమె తాజాగా ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. 2008-10 మధ్య జగదల్పూరు జైల్లో ఖైదులో ఉన్న నలుగురు ఆదివాసీ బాలికల్ని చూసింది. ఆమెను గమనించిన వెంటనే బాలికలు గజగజ వణికిపోయారు. వారిని చూసిన ఆమెకు డౌటొచ్చి పరీక్షగా చూసింది. వారి శరీరాలపై కొన్ని గుర్తులున్నాయి. వెంటనే.. బాలికలకి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. పరీక్షల తర్వాత ఆమెకు కొన్ని భయంకరమైన నిజాలు తెలిశాయి. ఆ పిల్లల చేతులపై రొమ్ములపై కరెంటు షాకులిచ్చి మరీ హింసించారు. ఆ బాలికలందరూ 14 నుంచి 16 మధ్య వయస్కులే. మావోయిజానికి సంబంధించిన ఆరోపణలపై జైల్లో ఉన్నారు. ఎంత మావోయిజం అయితే మాత్రం అంత హింసిస్తారా? అని ఆమె బాధపడింది. ఈ పాత సంఘటనను ఆమె తాజాగా ఫేస్ బుక్ లో పంచుకుంది. అంతే.. ఆమె బదిలీ వేటు పడింది. రాయ్ పూర్ నుంచి 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంబికాపూర్ జైలుకు బదిలీ చేశారు.

దీనిపై ఆమె గళం విప్పారు. తాను అధికారిక సమాచారాన్నో.. అధికారిక రహస్యాల్నో బయటపెడితే సర్వీసు నిబంధనల్ని బ్రేక్ చేసినట్లు అవుతుందని.. కళ్లతో చూసిన చిత్రహింసల వివరాలు బయటపెడితే ఎలా శిక్ష విధిస్తారంటూ వర్షా డోంగ్రే ప్రశ్నిస్తోంది. దేశ ప్రజలందరితో పాటు తనకూ భావ ప్రకటనా స్వేచ్ఛ ఉందని అంటోంది.

HACK:

  • Jailer Varsha Dongre Suspended for exposing torture and sexual abuse of Adivasis.