పవన్‌‌కు, లోకేశ్‌కు మేమే ఎక్కువ.. ఇక ఆయనెందుకు?: రోజా - MicTv.in - Telugu News
mictv telugu

పవన్‌‌కు, లోకేశ్‌కు మేమే ఎక్కువ.. ఇక ఆయనెందుకు?: రోజా

June 11, 2022

‘‘పవన్ కళ్యాణ్‌కు, లోకేశ్‌కు మేమే ఎక్కువ. జగన్మోహన్ రెడ్డి ఎందుకు వస్తారు. ఎక్కడికైనా చర్చకు వచ్చేందుకు మేము సిద్ధం’’ అంటూ మంత్రి రోజా లోకేశ్‌కు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు సవాల్ విసిరారు. ఆమె శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ.. ”గడపగడపకు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. పదో తరగతి ఫలితాలపై కూడా టీడీపీ రాజకీయ చెయ్యడం దిగజారుడుతనానికి నిదర్శనం. జూమ్ మీటింగ్‌లో కొడాలి నాని, వంశీ వస్తే, లోకేశ్‌కు ఎందుకు పారిపోయాడు?. జీవితంలో లోకేశ్ అసెంబ్లీలోకి రాలేడు” అని ఆమె అన్నారు.

మరోపక్క తిరుమలలో నేడు రోజా ఎస్కార్ట్ వాహనం డ్రైవర్ నిబంధనలకు వ్యతిరేకంగా తిరుమల శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఉద్యోగులు వెళ్లే బయోమెట్రిక్ మార్గం నుంచి సంప్రదాయ దుస్తులు ధరించకుండా వెళ్లారని, దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) సిబ్బంది అతడిని అడ్డగించి, అతడిని మహాద్వారం నుంచి వెనక్కి పంపించారు. ఈ సంఘటనపై రోజా మాట్లాడుతూ.. ”నా ఎస్కార్ట్ వాహనం డ్రైవర్ మహాద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించినట్టు జరగుతున్న ప్రచారం తప్పు. కొన్ని చానెల్స్ నాపై అసత్య ప్రచారం చేస్తున్నాయి. నేను, నా సిబ్బంది ఆలయ నిబంధనలకు వ్యతిరేకంగా ఎప్పుడు నడుచుకోలేదు” అని ఆమె వివరణ అన్నారు.