పాపం చిరుత.. కారు ఢీకొట్టడంతో.. వీడియో వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

పాపం చిరుత.. కారు ఢీకొట్టడంతో.. వీడియో వైరల్

June 21, 2022

Leopard gets hit by car on busy highway. Shocking viral video angers Internet

అడవి నుంచి జనావాసాల్లోకి వచ్చిన ఓ చిరుతపులి తీవ్ర ఇబ్బందులకు గురైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రోడ్డు దాటుతున్న చిరుత ప్రమాదానికి గురైంది. కారు వేగంగా ఢీ కొట్టడంతో చిరుతకు తీవ్ర గాయాలయ్యాయి. కారు బానెట్‌ కింద ఇరుక్కుపోయి తీవ్ర ఇబ్బంది పడింది. కొద్దిసేపు కారు కిందే ఉన్న చిరుత ఆ తర్వాత మెల్లగా దాని కింద నుంచి బయటకు వచ్చింది. అదే సమయంలో కారు డ్రైవర్‌ కూడా వాహనాన్ని వెనక్కి నడిపించడంతో అది బయటపడింది. అనంతరం వెంటనే పక్కన ఉన్న అడవిలోకి పారిపోయింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం కూడా దెబ్బతింది. ఈ ఘటన మొత్తాన్ని చుట్టుపక్కల వారు మొబైల్‌ ఫోన్లలో చిత్రీకరించి సోషల్‌మీడియాలో పోస్టు చేశారు.

ఈ వీడియోను బాలీవుడ్ నటి రవీనా టాండన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. గాయపడిన ఆ చిరుత త్వరగా కోలుకోవాలని ప్రార్ధించారు. పొలిటికల్ లీడర్స్.. వన్యమృగాల సంరక్షణను దృష్టిలోపెట్టుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. చిరుతను రక్షించేందుకు కారు డ్రైవర్ కారును వెనక్కి లాగినప్పుడు, చిరుత తన కోపాన్ని వ్యక్తం చేస్తూ కారుపై దాడి చేసింది. చిరుతపులి గాయపడటాన్ని చూసి తట్టుకోలేకపోయానని ఒకరు, చిరుతపులికి ఎటువంటి గాయాలు కాకూడదని ఆశిస్తున్నట్లు మరొకరు కామెంట్లు చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా హైవేలపై అండర్‌పాస్‌ల నిర్మాణం వంటివి చేపట్టి, వన్యప్రాణులు ప్రమాదాలకు గురవకుండా చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.
Leopard gets hit by car on busy highway. Shocking viral video angers Internet

Leopard, hit by car , busy highway. Shocking viral video, angers Internet