పాపమని ఆహారమేయబోతే.. ఆ చిన్నారినే లాక్కెళ్లింది..! - MicTv.in - Telugu News
mictv telugu

పాపమని ఆహారమేయబోతే.. ఆ చిన్నారినే లాక్కెళ్లింది..!

May 22, 2017


సరస్సులు, సముద్రాలు సందర్శించినప్పుడు సరదాగా వాటిలో జంతువులకి ఆహారం మేస్తుంటారు. కొందరైతే వాటికి మరి దగ్గరగా వెళ్లి అందిస్తుంటారు. కానీ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలకే ముప్పు అని తెలుసుకోలేకపోతున్నారు. ఇలాగే ఆహారమేసేందుకు ప్రయత్నించిన ఓ చిన్నారి సముద్ర జంతువు లాక్కెళ్లింది.
కెనడా వెస్టర్న్‌ కోస్ట్‌లోని స్టీవెస్టన్‌ సముద్ర తీరానికి కొందరు పర్యాటకులు వచ్చారు. అక్కడ సముద్ర అందాలను చూసేందుకు ఓ వంతెన లాంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు. వంతెన సమీపం దగ్గర ఈదుతున్న ఓ సీల్‌ను చూడగానే.. కొందరు వ్యక్తులు నీళ్లలోకి ఆహారాన్ని విసిరారు. అది చూసిన సీల్‌ వంతెన పక్కకు వచ్చింది. ఓ చిన్నారి నీటిలోకి చూస్తుండగా.. సీల్‌ చిన్నారి సమీపానికి వచ్చి ఎగిరి మళ్లీ వెంటనే వెనక్కి వెళ్లిపోయింది.హమ్మయ్యా.. అనుకుని ఆ చిన్నారి వంతెనపై కూర్చుంది. ఇంతలోనే మళ్లీ వచ్చిన ఆ సీల్‌.. చిన్నారి డ్రెస్‌ పట్టుకుని నీటిలోకి లాక్కెళ్లింది. ఇది చూసిన ఓ వ్యక్తి వెంటనే దూకి చిన్నారిని రక్షించి పైకి తీసుకొచ్చాడు. ఈ ప్రమాదంలో చిన్నారికి గానీ ఆ వ్యక్తికి గానీ ఎలాంటి హానీ జరగలేదు. ఈ ఘటనంతా ఓ వ్యక్తి వీడియో తీసి యూట్యూబ్‌లో పోస్టు చేయడంతో ఇప్పుడు వైరల్ అవుతోంది.